KCR : నన్ను చూసేందుకు ఎవ్వరు ఆస్పత్రికి రావద్దు : కేసీఆర్ విజ్ఞప్తి

తనను చూసేందుకు యశోద ఆస్పత్రికి ఎవ్వరు రావద్దు అంటూ ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తానే త్వరలో వస్తానని..తెలిపారు.

KCR : నన్ను చూసేందుకు ఎవ్వరు ఆస్పత్రికి రావద్దు : కేసీఆర్ విజ్ఞప్తి

Updated On : December 12, 2023 / 6:03 PM IST

KCR appeal to people: యశోదా ఆస్పత్రిలో తుంటి ఎముక సర్జరి తరువాత కేసీఆర్ కోలుకుంటున్నారు. ఈక్రమంలో ఎంతోమంది ప్రముఖులు ఆయన్ని స్వయంగా కలిసి పరామర్శించేందుకు వస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్టారావు, దామోదర రాజనర్శింహ, శ్రీధర్ బాబు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వంటి ఎంతోమంది ప్రముఖులు ఆయన్ని స్వయంగా కలిసి..ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు..

కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తనను చూసేందుకు యశోద ఆస్పత్రికి ఎవ్వరు రావద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తనను చూసేందుకు రావటం వల్ల తనతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఇబ్బంది కలుగుతోందన్నారు. తన వల్ల..ఇతర రోగులు ఇబ్బందులు పడకూడదన్నారు. ఇన్‌ఫెక్షన్ వస్తుందని డాక్టర్లు చెప్పారని అన్నారు.  కాబట్టి ఎవ్వరు ఆస్పత్రికి రావద్దని కోరారు. తాను త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తాను అంటూ కేసీఆర్ వీడియోలో తెలిపారు.

కాగా..ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించటానికి వచ్చిన మంత్రులు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా సహకరించాలని కోరారు. ఇదే విషయంపై కేటీఆర్ తో చర్చించారు. దీనికి గులాబీ బాస్ అంగీకరించారు.