సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్‌డీ పేరుతో మోసాలు చేస్తున్న మాజీ క్రికెటర్ అరెస్ట్
గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పీఏ పేరుతోనూ అతడు మోసాలకు పాల్పడ్డాడు.

CM Revanth Reddy
సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్‌డీ పేరుతో చెలామణి అవుతున్న రంజీ మాజీ క్రికెటర్ బుడుమురు నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళానికి నాగరాజు ర్యాపిడో, కంట్రీ డిలైట్ ఎండీలకు ఫోన్ చేసి తాను రేవంత్ రెడ్డి ఓఎస్‌డీని అని చెబుతూ డబ్బులు డిమాండ్ చేశాడు. అలాగే, పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఛైర్మన్‌లకు వాట్సాప్ మెసేజ్‌లు పంపాడు.
ఓఎస్‌డీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. నాగరాజు ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, అతడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 కేసులు ఉన్నట్టు గుర్తించారు. శ్రీకాకుళంలో అతడిని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు.
Also Read: కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ.. “మై డియర్ డాడీ” అంటూనే..
బుడుమురు నాగరాజు గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పీఏ పేరుతోనూ మోసాలకు పాల్పడ్డాడు. అప్పట్లో చంద్రబాబు పీఏగా పెండ్యాల శ్రీనివాస్ పనిచేశారు. ఆ సమయంలో ఆయన పేరుతో బుడుమూరి నాగరాజు దందాలు చేశాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశాడు. అయినప్పటికీ నాగరాజుకు బుద్ధి రాలేదు. ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డి ఓఎస్‌డీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నాడు.