నాకు ప్రాణహాని ఉంది.. ప్రభుత్వం భద్రత కల్పించాలి.. కంటతడి పెట్టిన జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్

సర్దార్ నాకు దగ్గరి వాడు, ఆయన మరణం నన్ను కలిచివేసింది. సర్దార్ చనిపోయాడని తెలియగానే వెళ్లాలనుకున్నా.. కానీ, అక్కడ నన్ను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని ఫసీయుద్దీన్ అన్నారు.

నాకు ప్రాణహాని ఉంది.. ప్రభుత్వం భద్రత కల్పించాలి.. కంటతడి పెట్టిన జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్

Updated On : June 4, 2025 / 10:51 AM IST

Congress Corporator Baba Fasiuddin: జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ కంటతడి పెట్టుకున్నాడు. బీఆర్‌ఎస్‌ బోరబండ మైనార్టీ డివిజన్‌ నాయకుడు మహ్మద్‌ సర్దార్‌ మరణానికి నేను కారణం అంటూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నాపై కుట్ర చేశాడని ఫసీయుద్దీన్ ఆరోపించాడు. సర్దార్ నాకు దగ్గరి వాడు, ఆయన మరణం నన్ను కలిచివేసింది. సర్దార్ చనిపోయాడని తెలియగానే వెళ్లాలనుకున్నా.. కానీ, అక్కడ నన్ను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని ఫసీయుద్దీన్ అన్నారు.

 

లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని పోలీసులు సర్దార్ అంతిమ యాత్రకు నన్ను రానివ్వలేదు. సర్దార్ ప్రమాదవశాత్తు చనిపోయాడని పోలీసులు రిపోర్టు ఇచ్చారు. కానీ, సూసైడ్ చేసుకున్నాడని మాగంటి గోపీనాథ్ అసత్య ప్రచారం చేశాడు. మాగంటి శవ రాజకీయాలు చేశారు. నాపై, నా ఇంటిపై మాగంటి దాడి చేయించడానికి ప్రయత్నించాడని ఫసీయుద్దీన్ ఆరోపించారు.

 

నాపై దాడి చేయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారు. నాపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై నగర కమిషనర్ కు ఫిర్యాదు చేస్తాను. కొంతమంది రౌడీ షీటర్లతో నాకు ప్రాణహాని ఉంది. ప్రభుత్వం భద్రత కల్పించాలని కోరుతున్నానని ఫసీయుద్దీన్ అన్నారు.