Harish Rao : దటీజ్ హరీశ్ రావు.. పేద విద్యార్థిని ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టిన మాజీ మంత్రి

Harish Rao : పేద విద్యార్థుల చదువు కోసం ఆర్థిక సహాయం చేసేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్ రావు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు.

Harish Rao : దటీజ్ హరీశ్ రావు.. పేద విద్యార్థిని ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టిన మాజీ మంత్రి

Harish Rao

Updated On : December 19, 2025 / 2:20 PM IST

Harish Rao : పేద విద్యార్థుల చదువు కోసం ఆర్థిక సహాయం చేసేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్ రావు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. తాజాగా.. ఓ విద్యార్థిని ఫీజు కోసం ఏకంగా తన ఇంటినే మాజీ మంత్రి హరీశ్ రావు తనఖా పెట్టారు.

Also Read : IND vs SA : అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన టీమిండియా క్రికెటర్లు.. వీళ్ల స్టైల్ చూసి ఫ్యాన్స్ ఫిదా.. అచ్చం సినిమా హీరోల్లా.. ఫొటోలు వైరల్

పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం మాజీ మంత్రి హరీశ్ రావు తన ఇల్లు తనఖా పెట్టి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్‌లో సీటు వచ్చింది. అయితే, ట్యూషన్ ఫీజులకు ప్రతీఏటా రూ.7.50లక్షల రూపాయలు చెల్లించాలని కళాశాల యాజమాన్యం సూచించింది. బ్యాంకు రుణం కోసం వెళ్లగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామని బ్యాంక్ సిబ్బంది చెప్పారు.

ఇదే విషయా విద్యార్థిని తండ్రి రామచంద్రం హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హరీశ్ రావు సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. హాస్టల్ ఫీజుకుసైతం రూ.లక్ష సహాయం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని మమత, ఆమె తల్లిదండ్రులు హరీశ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థిని తండ్రి రామచంద్రం మాట్లాడుతూ.. నా బిడ్డ కష్టపడి చదివి ప్రభుత్వ కన్వీనర్ కోటాలో సీటు సంపాదించింది. ఆర్థిక స్తోమత లేక ట్యూషన్ ఫీజు కూడా చెల్లించే పరిస్థితి లేదు. మేం చేసిన ప్రయత్నాలకు అన్ని దారులు మూసుకుపోయాయి. కానీ, ఆపద వచ్చినవారి కోసం నిరంతరం తన ఇంటి తలుపులు తెరిచి ఉంచే హరీష్ అన్న ఏకంగా తన ఇంటిని మాకోసం తాకట్టు పెడతాడని కలలో కూడా ఊహించలేదని రామచంద్రం అన్నారు.

నా నలుగురు బిడ్డలు హరీష్ అన్న స్ఫూర్తితోనే, ఆయన చేసిన సహాయంతోనే ఎంబిబిఎస్ వైద్య విద్య చదువుతున్నారు. పెద్ద బిడ్డ ప్రస్తుతం పీజీ సీటు దక్కించుకోగా.. రెండో అమ్మాయి ఎంబిబిఎస్ హౌస్ సర్జన్ చేస్తుంది. మరో ఇద్దరు అమ్మాయిలు జగిత్యాలలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదువుతున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలోని మూడు లక్షల మందిలో మేము ఒకరం. అంతేతప్ప మరెలాంటి బంధుత్వ సంబంధం లేదు. అయినా, మా పాప భవిష్యత్తుకోసం ఒక్క క్షణం ఆలోచించకుండా తన ఇంటిని తాకట్టు పెట్టిన హరీష్ అన్న రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమని రామచంద్రం పేర్కొన్నారు.