ఒకప్పుడు చిరంజీవి టాప్.. ఇప్పుడు బన్నీ.. మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక కామెంట్స్

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీడియా చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు చిరంజీవి టాప్.. ఇప్పుడు బన్నీ.. మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక కామెంట్స్

Malla Reddy

Updated On : March 13, 2025 / 2:13 PM IST

Malla Reddy: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీడియా చిట్ చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు యూనివర్శిటీలు పెట్టానన్న ఆయన.. లలిత జ్యువెలర్స్ అధినేత మాదిరి నేనూ ఏఐ ద్వారా ప్రమోషన్ చేస్తానని, ఏఐ టెక్నాలజీ వాడి కాలేజీల ప్రమోషన్ చేస్తామని అన్నారు. తిక్క రాజకీయాల మీద కాకుండా ప్రస్తుతం విద్యా సంస్థల మీద ఫోకస్ పెట్టినట్లు చెప్పారు.

 

దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఏఐతో విద్యార్థులకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నామని, ల్యాప్ టాప్ లేనిదే కాలేజీకి రావొద్దని చెబుతున్నామని అన్నారు. స్కిల్, టెక్నాలజీ ఉన్నోడికే జాబ్ ఇవ్వాలని చెప్పిన మల్లారెడ్డి.. చైనా టెక్నాలజీ ఉపయోగించి విద్యా సంస్థలు నడపబోతున్నానని అన్నారు. ఇదే క్రమంలో చిరంజీవి, అల్లు అర్జున్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

ఒకప్పుడు హీరో చిరంజీవి టాప్.. ఇప్పుడు ఆ స్థానాన్ని అల్లు అర్జున్ కొట్టేశాడు. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప సినిమా 1800 కోట్లు వసూలు చేసి ప్రపంచంలో స్టార్ హీరో అయ్యాడు. అందుకే ప్రతి ఒక్కరూ అప్ డేట్ కావాలి అంటూ మల్లారెడ్డి పేర్కొన్నారు. అయితే, చిరంజీవి, అల్లు అర్జున్ పేర్లు ప్రస్తావిస్తూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.