Vijaya Rama Rao: మాజీ మంత్రి విజయ రామారావు మృతి.. సీఎం కేసీఆర్, చంద్రబాబు సంతాపం

మాజీ మంత్రి కే విజయరామరావు సోమవారం అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు. మరోవైపు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా విజయ రామారావు మృతిపై సంతాపం ప్రకటించారు.

Vijaya Rama Rao: మాజీ మంత్రి విజయ రామారావు మృతి.. సీఎం కేసీఆర్, చంద్రబాబు సంతాపం

Updated On : March 13, 2023 / 9:29 PM IST

Vijaya Rama Rao: సీబీఐ మాజీ అధికారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కే విజయరామరావు సోమవారం అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు.

UPI Payment Limit: యూపీఐ పేమెంట్లపై పరిమితి.. ఏ బ్యాంకు డైలీ లిమిట్ ఎంతంటే..

ప్రభుత్వ అధికారిగా, ప్రజా ప్రతినిధిగా విజయరామారావు అందించిన ప్రజా సేవలు గొప్పవని కేసీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, అనంతరం తెలంగాణ రాష్ట్రంలో విజయ రామారావుతో తనకున్నఅనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయరామారావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.

మరోవైపు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా విజయ రామారావు మృతిపై సంతాపం ప్రకటించారు. విజయ రామారావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన సీబీఐ డైరెక్టర్‌గా, మంత్రిగా విశేష సేవలు అందించారని కొనియాడారు.