Padmanabha Reddy : 5 ఓట్లు ఉంటే తులం బంగారం..! మునుగోడు ఉపఎన్నికల్లో పీక్స్‌కు ప్రలోభాల పర్వం-పద్మనాభ రెడ్డి
మునుగోడు ఉపఎన్నిక దేశంలోనే కాస్ట్ లీ ఎన్నికగా మారుతుందన్నారు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి. అధికార, ప్రతిపక్ష పార్టీలు కోట్లలో ఖర్చు పెట్టి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్తగా నమోదు చేసుకున్న 20వేల మంది ఓట్లను పరిశీలించాలన్నారు పద్మనాభ రెడ్డి.

Padmanabha Reddy : మునుగోడు ఉపఎన్నిక దేశంలోనే కాస్ట్ లీ ఎన్నికగా మారుతుందన్నారు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి. అధికార, ప్రతిపక్ష పార్టీలు కోట్లలో ఖర్చు పెట్టి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్తగా నమోదు చేసుకున్న 20వేల మంది ఓట్లను పరిశీలించాలన్నారు పద్మనాభ రెడ్డి.
”దేశంలోనే మునుగోడు ఉపఎన్నిక కాస్ట్ లీగా మారింది. మునుగోడు ఉపఎన్నికలో ప్రలోభాలు ఎక్కువయ్యాయి. 5 ఓట్లుంటే తులం బంగారం, మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 20వేల మందికి పైగా కొత్తగా ఓటర్ గా నమోదు చేసుకున్నారు. ఎందుకు? లాలూచీ పడ్డారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
అక్కడ ఓటర్ గా నమోదైతే రాజకీయ పార్టీలు వస్తాయి. మాకు డబ్బు ఇస్తాయి. గొర్రెల పంపిణీ తరహాలో ఓటర్లకు డైరెక్ట్ గా క్యాష్ ఇస్తున్నారు. పార్టీ కండువా కప్పుకుంటే పది వేలో, 20వేలో ఇస్తారని రాస్తున్నారు. ఒక్కో అభ్యర్థి రూ.200 కోట్లు, రూ.300 కోట్లు ఖర్చు పెట్టాలని ప్లాన్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ప్రలోభాలను అరికట్టాలి” అని పద్మనాభ రెడ్డి విజ్ఞప్తి చేశారు.