Medak Road Accident : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొన్న కారు, నలుగురు దుర్మరణం
మృతులు ఆర్మూర్ మండలం ఏలూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఆర్మూర్ నుండి గజ్వేల్ కు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Medak Road Accident
Road Accident Four died : మెదక్ జిల్లా నార్సింగి శివారులోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం నార్సింగి మండలం మల్లూరు వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆటోను బలంగా ఢీకొట్టింది.
దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులు ఆర్మూర్ మండలం ఆలూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఆర్మూర్ నుండి గజ్వేల్ కు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Rangareddy Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
మృతులు తండ్రీకొడుకులు శేఖర్, యశ్వంత్(9), దంపతులు బాలనర్సయ్య, మణెమ్మగా, గాయపడినవారు కవిత, అవినాశ్ గా పోలీసులు గుర్తించారు. వీరంతా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.