TSRTC : శబరిమల యాత్రకు టీఎస్ఆర్టీసీ బస్సులో ఆ ఐదుగురికి ఉచిత ప్రయాణం
ప్రయాణికులను ఆకర్షించేందుకు టీఎస్ఆర్టీసీ వినూత్న ఆఫర్లతో దూసుకెళ్తోంది. తాజాగా శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు మరో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది.

Tsrtc Bus
Free travel for Sabarimala Yatra : ప్రయాణికులను ఆకర్షించేందుకు టీఎస్ఆర్టీసీ వినూత్న ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇప్పటికే సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే శుభకార్యాలకు బస్సులను కిరాయికి ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు మరో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది.
తక్కువ చార్జీలకు స్పెషల్ బస్సులను కిరాయికి ఇవ్వడంతోపాటు ప్రతీ బస్సులో ఇద్దరు వంట మనుషులు, పదేళ్ల లోపు ఇద్దరు మణికంఠ స్వాములు, ఒక అటెండర్‌కు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు వెల్లడించింది.
Drug laws: డ్రగ్స్ చట్టాల్లో సడలింపులు.. మొదటిసారైతే జైల్లో పెట్టరు
36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సుకు కిలో మీటర్‌కు రూ. 48.96, 40 సీట్ల డీలక్స్ బస్సుకు రూ.47.20, 48 సీట్ల డీలక్స్ బస్సుకు రూ.56.64, 49 సీట్ల ఎక్స్‌ప్రెస్ బస్సుకు కిలో మీటర్‌కు రూ. 52.43 చార్జీ నిర్ణయించింది. బస్సులు కావాల్సిన భక్తులు దగ్గరలోని బస్‌స్టేషన్లలో సంప్రదించాలని సూచించింది.