Free Travel On RTC Bus : టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం
ఉచితంగా ప్రయాణించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా.. తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించాలని పేర్కొన్నారు. విద్యార్థులు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ఈ సౌలభ్యం కలిగిస్తున్నట్టు తెలిపారు.

Rtc Bus Free Travel
Free travel on TSRTC bus : విద్యార్థుల కోసం తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి పరీక్షలు రాసే పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. ఇవాళ్టి నుంచి పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది. ఈ సౌకర్యంతో.. విద్యార్థులను వారి పరీక్షా కేంద్రాల వద్దకు ఆర్టీసీ బస్సులు తీసుకెళ్లనున్నాయి. మళ్లీ పరీక్ష ముగిసిన తర్వాత కూడా బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉచితంగా ప్రయాణించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా.. తమ హాల్ టికెట్లను కండక్టర్లకు చూపించాలని పేర్కొన్నారు. విద్యార్థులు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆర్టీసీ తరఫున ఈ సౌలభ్యం కలిగిస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణలో నేటి నుంచి టెన్త్ పరీక్షలు మొదలు కానున్నాయి. నేటి నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12గంటల 45 నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు 8.30 గంటల వరకు చేరుకోవాలని విద్యాశాఖ సూచించింది. పేపర్ లీకేజీ, మాస్ కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వకుండా పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
10th Exams : నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్..ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
రాష్ట్రవ్యాప్తంగా 2వేల 861 పరీక్ష కేంద్రాలలో 5లక్షల 9 వేల 275 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 2లక్షల 58వేల98మంది బాలురు, 2లక్షల 51వేల177 మంది బాలికలు పదో తరగతి పరీక్ష రాయనున్నారు. అయితే పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా.. పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద డీఈఓ, ఏంఈవో ఫోన్ నెంబర్లను డిస్‌ప్లే చేయనున్నారు.
పరీక్షలు జరుగుతున్న సమయంలో కరెంట్ సప్లైకు అంతరాయం కలగకుండా చూడాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్.. ఓఆర్ఎస్ పాకెట్లు, అవసరమైన మందులతో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.