Fancy Numbers: బాలకృష్ణ మజాకా.. ఫ్యాన్సీ నెంబర్ కోసం 7.75 లక్షలు.. 30 లక్షల కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం 34 లక్షలు చెల్లించిన వ్యాపారవేత్త..

ఫ్యాన్సీ నెంబర్ల కోసం వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ప్రత్యేక గుర్తింపు కోసం కొందరు, సెంటిమెంట్ తో మరికొందరు తమకు కలిసి వచ్చే నెంబర్లను పొందుతున్నారు.

Fancy Numbers: బాలకృష్ణ మజాకా.. ఫ్యాన్సీ నెంబర్ కోసం 7.75 లక్షలు.. 30 లక్షల కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం 34 లక్షలు చెల్లించిన వ్యాపారవేత్త..

Updated On : April 20, 2025 / 8:12 PM IST

Fancy Numbers: ఫ్యాన్సీ నెంబర్లకు ఫుల్ గా డిమాండ్ పెరిగిపోతోంది. లగ్జరీ వెహికల్స్ కు సరిపోయేలా ఫ్యాన్సీ నెంబర్లను ఎంచుకుంటున్నారు. నచ్చిన నెంబర్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడటం లేదు. ఫ్యాన్సీ నెంబర్లతో సర్కార్ కూడా భారీగానే ఆదాయం సమకూర్చుకుంటోంది. తన కారుకు ఫ్యాన్సీ నెంబర్ కోసం హీరో నందమూరి బాలకృష్ణ ఏకంగా లక్షలు ఖర్చు పెట్టారు. శనివారం జరిగిన వేలంలో TG 09 F 0001 నెంబర్ ను 7 లక్షల 75వేలకు దక్కించుకున్నారు.

ఫ్యాన్సీ నెంబర్ల కోసం వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ప్రత్యేక గుర్తింపు కోసం కొందరు, సెంటిమెంట్ తో మరికొందరు తమకు కలిసి వచ్చే నెంబర్లను పొందుతున్నారు. కారణం ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో కొన్ని ఫ్యాన్సీ నెంబర్లు వేలంలో రికార్డు స్థాయి ధరలు పలికాయి. TG 09 9999 నెంబర్ కోసం ఏకంగా 25 లక్షలు వెచ్చించారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డ తర్వాత తీసుకొచ్చిన టీజీ సిరీస్ లో TG 09 0001 కోసం ఓ సంస్థ 9 లక్షలకు పైగా ప్రభుత్వానికి చెల్లించి ఆ నెంబర్ ను దక్కించుకుంది.

ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో 7లక్షల 75వేల రూపాయలు చెల్లించి టీజీ 09 ఎఫ్ 0001 నంబర్‌ను సొంతం చేసుకున్నారు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ. తన బీఎండబ్ల్యూ వాహనం కోసం బాలయ్య ఈ నంబర్‌ను తీసుకున్నారట.

Also Read: మీరు హోం లోన్ తీసుకున్నారా? దిగొస్తున్న వడ్డీ రేట్లు.. ఈఎంఐల భారం ఇలా తగ్గించుకోవచ్చు.. ఫుల్ డిటెయిల్స్..!

ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో ఒక్క ఖైరతాబాద్ జోన్‌లోనే రవాణశాఖకు ఒక్కరోజులో 37లక్షల 15వేల 645 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. మిగతా ఫ్యాన్సీ నంబర్లలో ఎఫ్ 0099 నంబర్‌ను కాన్కాప్ ఎలక్ట్రికల్స్ సంస్థ 4,75,999కి సొంతం చేసుకుంది. టీజీ 09 ఎఫ్ 0009 నెంబర్ ను కమలాలయ హైసాఫ్ట్ సంస్థ దక్కించుకుంది. ఎఫ్ 0005 నెంబర్‌ను జెట్టి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ రూ.1,49,999కి కొనుక్కుంది.

ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దేశం మొత్తం ఫ్యాన్సీ నెంబర్ల హవా నడుస్తోంది. కోట్లు ఖరీదు చేసి ఇష్టంగా కొనుగోలు చేసే వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. ఇక దేశంలో హయ్యస్ట్ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారవేత్త 30 లక్షలు పెట్టి కొన్న టయోటా ఫార్చునర్ కోసం ఏకంగా 34 లక్షలు పెట్టి ఫ్యాన్సీ నెంబర్ కొనుగోలు చేశాడట. ఆ వ్యక్తి జేమ్స్ బాండ్ ఫ్యాన్ కావడంతో.. ఆ తరహా ఫ్యాన్సీ నెంబర్ 007 కోసం అతడు ఏకంగా 34 లక్షలు చెల్లించాడు.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here