Burial Ground People: రూ.10 వేలు ఇస్తేనే చితి దిగుతా

వ్యక్తి చనిపోయి బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు కాటికాపరి చేసిన పని ఆగ్రహం తెప్పించింది. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలంటే ముందు తనకు పదివేలు సమర్పించుకోవాలని కాటికాపరి చితిపై కూర్చున్నాడు.

Burial Ground People: రూ.10 వేలు ఇస్తేనే చితి దిగుతా

Updated On : April 12, 2021 / 1:05 PM IST

Burial Ground People: వ్యక్తి చనిపోయి బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు కాటికాపరి చేసిన పని ఆగ్రహం తెప్పించింది. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలంటే ముందు తనకు పదివేలు సమర్పించుకోవాలని కాటికాపరి చితిపై కూర్చున్నాడు.

ఈ సంఘటన జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన మిట్టపెల్లి బాపురెడ్డి ఆదివారం చనిపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్లగా కాటికాపరులు వచ్చి చితిపై కూర్చుని అంతిమ సంస్కారాలను అడ్డుకున్నారు.

తనకు 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాము అడిగింది ఇస్తేనే చితి మీది నుంచి దిగుతామని భీష్మించారు. చితి వద్దకు వచ్చిన గ్రామస్తులు కాటికాపరిని చాలా సేపు బ్రతిమాలారు. వెయ్యి రూపాయలు ఇస్తామని తెలిపారు. అయినా అతడు వినకపోవడంతో గ్రామస్తులు బలవంతంగా చితిపై కూర్చున్న కాటికాపరిని కిందకు దింపి అంత్యక్రియలు నిర్వహించారు.