కరోనాతో వ్యక్తి చనిపోయి 8 గంటలు దాటినా పట్టించుకోని సిబ్బంది.. గాంధీ ఆసుపత్రిలో దారుణం

హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరోసారి సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి చనిపోయి 8 గంటలు దాటిన సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో మృతదేహం దుర్వాసన వస్తుండటంతో తోటి రోగులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు.
ఇవాళ ఉదయం నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ అదేవిధంగా పేషెంట్ కేర్ వాళ్లు అందరూ కూడా ఉదయం నుంచి ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు సంబంధించిన శాలరీలు పెంచాలని, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో గాంధీ హస్పిటల్ లో ట్రీట్మెంట్ లో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇవాళ తాజాగా దాదాపుగా 8 గంటల నుంచి మృతి చెందిన తర్వాత కూడా మృతదేహాన్ని తరలించటానికి ఎవ్వరూ లేక అక్కడే దుర్వాసన వచ్చింది. అయితే వార్డంతా ఖాళీ చేసి అక్కడున్న కరోనా పేషెంట్లు బయటికి వెళ్లడం జరిగిందని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. అయితే ఉదయం నుంచి సిబ్బంది ఆందోళనలో ఉండటం, ప్రత్యామ్నాయంగా ఎవ్వరూ లేకపోవడంతో అక్కడే మృతదేహన్ని ఉంచారు. గాంధీ హస్పిటల్ సిబ్బంది లేకపోవటంతో ఇబ్బంది ఎదుర్కొవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.
దుర్వాసన వస్తున్న పరిస్థితిలో అక్కడున్న కరోనా పేషెంట్లు వేరే వార్డుల్లో తమకు బెడ్స్ ఇవ్వాలని ఆ వార్డును ఖాళీ చేసి వెళ్లిపోయిన దుస్థితి గాంధీ హస్పిటల్ లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపైనా అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదని కరోనా బాధితులు వాపోతున్నారు.