Ganesh Nimajjanam 2022 : గణేశ్ నిమజ్జనోత్సవంలో తృటిలో తప్పిన ప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు

హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు గడ్డపై గణేశ్ నిమజ్జనోత్సవంలో తృటిలో ప్రమాదం తప్పింది. క్రేన్ ద్వారా గణేశ్ విగ్రహాన్ని లిఫ్ట్ చేస్తుండగా, ఒక్కసారిగా విగ్రహం పడిపోయింది.

Ganesh Nimajjanam 2022 : గణేశ్ నిమజ్జనోత్సవంలో తృటిలో తప్పిన ప్రమాదం.. పరుగులు తీసిన భక్తులు

Updated On : September 9, 2022 / 5:20 PM IST

Ganesh Nimajjanam 2022 : హైదరాబాద్ సరూర్ నగర్ చెరువు గడ్డపై గణేశ్ నిమజ్జనోత్సవంలో తృటిలో ప్రమాదం తప్పింది. క్రేన్ ద్వారా గణేశ్ విగ్రహాన్ని లిఫ్ట్ చేస్తుండగా, ఒక్కసారిగా విగ్రహం పడిపోయింది. వైర్లు తెగిపోవడం, బ్యాలెన్స్ తప్పి విగ్రహం వెనక్కి పడిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి.

విగ్రహం పడిపోతుండటాన్ని గమనించిన భక్తులు పరుగులు తీశారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. సరూర్ నగర్ చెరువులో ఇవాళ 450 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయన్నారు అధికారులు. ఇంతవరకు మొత్తం 1500 విగ్రహాలు నిమజ్జనం చేశారు.