Gay couple: తెలంగాణలో తొలిసారి.. ఒకటవుతున్న ‘గే’ జంట

విదేశాల్లో మామూలు అయిపోయింది కానీ, ఇండియాలో అదీ తెలంగాణలో మాత్రం తొలిసారి గే కపుల్ అధికారికంగా ఒకటవుతున్నారు. వారిద్దరి ఇష్టాలను సమాజానికి తెలియజేసి వివాహ బంధంతో ఒకటి కావాలని..

Gay couple: తెలంగాణలో తొలిసారి.. ఒకటవుతున్న ‘గే’ జంట

Gay Couple

Updated On : October 31, 2021 / 6:15 PM IST

Gay couple: విదేశాల్లో మామూలు అయిపోయింది కానీ, ఇండియాలో అదీ తెలంగాణలో మాత్రం తొలిసారి గే కపుల్ అధికారికంగా ఒకటవుతున్నారు. వారిద్దరి ఇష్టాలను సమాజానికి తెలియజేసి వివాహ బంధంతో ఒకటి కావాలనుకుంటున్నారు. సుప్రియో – అభయ్‌ల గే జంట ఎనిమిదేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత డిసెంబరులో పెళ్లి చేసుకున్నారట.

ఈ తంతు మొత్తాన్ని సాదాసీదాగా ముగించేయాలనుకోవడం లేదు. సాధ్యమైనంత వరకూ గ్రాండ్ సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నారట.

‘ఇదంతా ఎనిమిదేళ్ల క్రితమే మొదలైంది. ఓ డేటింగ్ యాప్ లో అతణ్ని కలిశాను. ఓ గంట సేపు మాట్లాడిన తర్వాత పరిచయం పెరిగింది. అలా ఎనిమిదేళ్లుగా ఉన్న మా బంధాన్ని వివాహం వరకూ తీసుకెళ్లాలనుకుంటున్నాం’ అని సుప్రియో అంటున్నాడు.

……………………………………………. : నల్లగా మారిన అరుణాచల్ నది..చైనానే కారణం!

భగవంతుని దయ వల్ల మా పేరెంట్స్ ఈ రిలేషన్ ను అర్థం చేసుకున్నారు. ఇండియన్ పేరెంట్స్ గా స్టార్టింగ్ లో సరే అనకపోయినా.. కాదని మాత్రం అనలేదు. దానిని బట్టి సమయం పడుతుందని వెయిట్ చేశాం. మా అమ్మ సపోర్ట్ చేయడంతో ఇది సాధ్యమైందని సుప్రియో చెబుతున్నారు.

‘నాకు స్కూల్ లో అవమానం జరిగేది. కొన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపాను కూడా. ఆ తర్వాత ఒక్కొక్కరు అర్థం చేసుకోవడం మొదలైంది. అందరిలాగే మేం కూడా పార్టనర్స్ ను ఎంచుకునే హక్కు ఉంది. ఇతర రాష్ట్రాల్లో చాలా మంది గే కపుల్స్ పెళ్లి చేసుకున్నారు కానీ, తెలంగాణలో తొలిసారి ఇటువంటి వివాహం జరుగుందని అభయ్ వెల్లడించాడు.

ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగిగా పనిచేస్తున్న అభయ్.. పేరెంట్స్, సొసైటీ ఇలాంటి రిలేషన్స్ కు అవునని చెప్పరు. 17ఏళ్లకే ఇల్లు వదిలిపెట్టి వచ్చేసి జీవితాన్ని వెతుక్కున్నాను. మీడియా ద్వారా పరిచయమైన సుప్రియో వల్ల నాకు చాలా క్లారిటీ వచ్చింది’ అని అభయ్ అంటున్నాడు.

……………………………………: మందుబాటిల్స్ ఎమ్మార్పీ ధరలపై 10శాతం ఎక్స్‌ట్రా చెల్లించాల్సిందే..

నేను బెంగాలీ.. తాను పంజాబీ. రెగ్యూలర్ మ్యారేజెస్ లాగే అన్ని కార్యక్రమాలతో పెళ్లి జరుగుతుంది. హల్దీ ఫంక్షన్ నుంచి, బ్రంచ్ పార్టీ, రింగులు మార్చుకోవడం వంటివి అన్నీ జరుగుతాయి. మా పేరెంట్స్ షాపింగ్ మొదలుపెట్టేశారు. వెడ్డింగ్ గురించి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది’ అని సుప్రియో అంటున్నారు.