జీహెచ్ఎంసీ ఎన్నికలు : బీజేపీ సెకండ్ లిస్ట్

  • Published By: madhu ,Published On : November 19, 2020 / 11:23 PM IST
జీహెచ్ఎంసీ ఎన్నికలు : బీజేపీ సెకండ్ లిస్ట్

Updated On : November 20, 2020 / 7:05 AM IST

GHMC ELECTION 2020: Telangana BJP : గ్రేటర్ హైదరాబాద్ లో పాగా వేయడానికి బీజేపీ స్కెచ్ లు వేస్తోంది. అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులు పార్టీలోకి వస్తారని భావిస్తోంది. 21 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2020, నవంబర్ 19వ తేదీ గురువారం సాయంత్రం రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో 19 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.



అభ్యర్థుల వివరాలు : –
ఝాన్సీ బజార్‌ – రేణు సోనీ. జియా గూడ – బోయిని దర్శన్‌. మంగల్‌హాట్‌ – శశికళ. దత్తాత్రేయ నగర్‌ – ఎమ్‌. ధర్మేంద్ర సింగ్‌. గోల్కొండ – పాశం శకుంతల. గుడిమల్కాపూర్‌ – దేవర కరుణాకర్‌. నాగోల్‌ – చింతల అరుణ యాదవ్‌. మన్సూరాబాద్‌ – కొప్పుల నర్సింహా రెడ్డి. హయత్‌ నగర్‌ – కల్లెం నవజీవన్‌ రెడ్డి.



బీఎన్‌ రెడ్డి నగర్‌ – ఎమ్‌ లచ్చిరెడ్డి. చంపాపేట్‌ – వంగ మధుసూధన్‌రెడ్డి. లింగోజీగూడ – ఆకుల రమేశ్‌ గౌడ్‌. కొత్తపేట్‌ – ఎన్‌. నవీన్‌ కుమార్‌ ముదిరాజ్‌. చైతన్యపురి – రంగ నరసింహ గుప్త. సరూర్‌ నగర్‌ – ఆకుల శ్రీవాణి. ఆర్కే పురం – రాధా ధీరజ్‌ రెడ్డి. మైలర్‌దేవ్‌పల్లి – తోకల శ్రీనివాసరెడ్డి. జంగమ్మెట్‌ – కే. మహేందర్‌.