Adilabad : రెండేళ్ల ప్రేమ.. ప్రియుడి మాటకు మనస్తాపం చెంది యువతి ఆత్మహత్య

ప్రేమించిన యువకుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

Adilabad : రెండేళ్ల ప్రేమ..  ప్రియుడి మాటకు మనస్తాపం చెంది యువతి ఆత్మహత్య

Adilabad

Updated On : September 29, 2021 / 3:13 PM IST

Adilabad : ప్రేమించిన యువకుడు వేరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. మనస్తాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్ఐ అంజమ్మ తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని అంకాపూర్ కు చెందిన మర్సుకోలు గంగుబాయి (18) జైనథ్ మండలం జామ్నికి చెందిన పెందూర్‌ రవీందర్ గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

Read More : Murder At Anantapuram : తన భార్య గురించి చెడుగా చెప్పాడని.. వియ్యంకుడి హత్య

ఈ క్రమంలోనే రవీందర్, తాను వేరే యువతిని పెళ్లి చేసుకుంటానని గంగుబాయికి చెప్పాడు. ప్రియుడి మాటకు మనస్తాపం చెందిన గంగుబాయి ఈ నెల 24న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది గంగుబాయి. తల్లి శోభబాయి ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Read More : Love Failure : మూడేళ్లు ప్రేమించి… వేరే యువతితో నిశ్చితార్థం…!