StaTwig: కరోనాపై పోరాటంలో స్టాట్‌విగ్ కంపెనీ
కరోనాపై పోరాటంలో స్టార్టప్ కంపెనీ స్టాట్‌విగ్ భాగస్వామ్యమైంది. జీఎంఆర్ ఎయిర్ కార్గో అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌తో స్టాట్‌విగ్ వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం వెనుక కథేంటి..? దాంతో ఉపయోగాలేంటి.

Statwig
StaTwig: కరోనాపై పోరాటంలో స్టార్టప్ కంపెనీ స్టాట్‌విగ్ భాగస్వామ్యమైంది. జీఎంఆర్ ఎయిర్ కార్గో అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌తో స్టాట్‌విగ్ వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం వెనుక కథేంటి..? దాంతో ఉపయోగాలేంటి..?
కరోనా వ్యాక్సిన్ల ఎగుమతులకు హైదరాబాద్ అడ్డాగా మారింది. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్ నుంచి ఏకంగా 350 కోట్ల కరోనా డోసులు ఉత్పత్తి కానున్నాయి. కరోనా వ్యాక్సిన్ రవాణాలో బ్లాక్‌చెయిన్ ఆధారిత రియల్ టైమ్ ట్రాకింగ్‌ను ఉపయోగించుకోనుంది GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో.
దీనికోసం స్టార్టప్ సంస్థ స్టాట్‌విగ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఒప్పందంపై జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సీఈఓ సౌరభ్ కుమార్, సిడ్ చక్రవర్తి, నృపుల్ పొనుగోటి, స్టాట్‌విగ్ కో ఫౌండర్స్ సంతకాలు చేశారు. ఫార్మా హబ్‌గా ఉన్న హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ ఎగుమతుల్లో GMR ఎయిర్‌కార్గో కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పుడు స్టాట్‌విగ్‌తో ఒప్పందం చేసుకోవడంతో ఆధునిక టెక్నాలజీ సాయంతో కార్గో టెర్మినల్ వద్ద వ్యాక్సిన్లను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తుంది.
మౌలిక సదుపాయాల పరంగా, సాంకేతిక పరిజ్ఞానంతో తన సామర్థ్యాలను పెంచుకుంటూ.. కరోనాపై పోరాటంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది స్టాట్‌విగ్. వ్యాక్సిన్ రవాణాలో తమ వినియోగదారులకు రియల్ టైమ్ సమాచారాన్ని అందించడానికి సహాయపడనుంది. స్టాట్‌విగ్ బ్లాక్‌చైన్ టెక్నాలజీ కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో వ్యాక్సిన్ సప్లై చెయిన్‌ను బలోపేతం చేయనుంది.
GHAC ద్వారా హ్యాండిల్ చేసే వ్యాక్సిన్లకు సంబంధించిన రియల్ టైమ్ ట్రాకింగ్, పర్యవేక్షణ వల్ల వ్యాక్సిన్ లెడ్జర్ ప్లాట్‌ఫామ్‌లో చేరిన తయారీదారులు, బయ్యర్లు వ్యాక్సిన్లు ప్రస్తుతం ఎక్కడున్నాయి..? వాటి నాణ్యత, భద్రతను తెలుసుకోగలిగే అవకాశముంది. ఈ ఒప్పందంపై ఎయిర్ కార్గో సీఈఓ సౌరభ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కార్గో పరిశ్రమలో మొట్టమొదటిసారిగా వ్యాక్సిన్ లెడ్జర్ విధానాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.