Gold Price Today: పసిడి పరుగు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు .. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
మహిళలకు షాకిస్తూ బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా బుధవారం ఉదయం నమోదైన ధరలను పరిశీలిస్తే..

Gold Prices
Gold and Silver Prices Today: తెలుగు రాష్ట్రాల్లో పండుగల సీజన్ ప్రారంభమైంది. మహిళలు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. అయితే, మహిళలకు షాకిస్తూ బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా బుధవారం ఉదయం నమోదైన ధరలను పరిశీలిస్తే.. బంగారం ధర భారీగానే పెరిగింది. 10గ్రాములు 22 క్యారెట్లుపై రూ. 150 పెరగగా, 24 క్యారెట్ల పై రూ.170 పెరిగింది. వెండి ధరసైతం పెరిగింది. కేజీ వెండిపై రూ. 300 పెరుగుదల చోటు చేసుకుంది.

Gold
బులియన్ మార్కెట్‌లో బుధవారం ఉదయం 6గంటల వరకు నమోదైన ధరల వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,200కు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ రూ. 60,220 కి చేరింది.

Gold
దేశంలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలను పరిశీలిస్తే..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ. 55,350 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,370కు చేరింది.
– ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 55,200 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,200కి చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 55,500 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 60,550కు చేరింది.
– బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,200 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 60,220కు చేరింది.
– కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,200 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,220కి చేరింది.

Gold
పెరిగిన వెండి ధర..
దేశవ్యాప్తంగా వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి ధరపై రూ. 300 పెరుగుదల చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 78,300 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 74,800, చెన్నైలో రూ. 78,300, ముంబయిలో రూ. 74,800, కోల్‌కతాలో 74,800, బెంగళూరులో రూ. 73,250 వద్ద కొనసాగుతుంది.