Telangana : టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి..పోస్టులు తగ్గవు.!
టీచర్ల హేతుబద్దీకరణ వల్ల స్కూల్స్ తగ్గడం కానీ టీచర్ పోస్టులు తగ్గడం కానీ ఉండదని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల ప్రారంభంపై మీడియాతో మాట్లాడారు సబితా

Sabitha
Telangana : సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా మూతబడిన విద్యాసంస్థలు, ప్రారంభం కానుండటంతో అధికారులు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశంపై విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.
కరోనాను దృష్టిలో ఉంచుకొని స్కూల్స్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. పాఠశాలలు తెరిచాక విద్యార్థులు తల్లిదండ్రులు ఆనందంతో ఉన్నారని అన్నారు. అంతే కాకుండా ఆన్ లైన్ క్లాసులు ఆఫ్ లైన్ క్లాస్ లకు ప్రత్యామ్నాయం కాదని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక ప్రైవేట్ విద్యాసంస్థల గురించి మాట్లాడుతూ.. గతంలోలా కాకుండా ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచామని…మాస్క్ లు ఇచ్చే ఏర్పాట్లు చేశామని అన్నారు.
టీచర్ల హేతుబద్దీకరణ వల్ల స్కూల్స్ తగ్గడం కానీ టీచర్ పోస్టులు తగ్గడం కానీ ఉండదని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. కాగా 8 ఆ పై తరగతుల విద్యార్థులకు విద్యాసంస్థల్లో క్లాసులు నిర్వహించనున్నారు. కింది తరగతుల వారికి ఆన్ లైన్ విధానంలోనే బోధించనున్నారు.