Trains Cancelled: పెద్దపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. 31 రైళ్లు రద్దు.. రద్దయిన రైళ్లు ఇవే..

పెద్దపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ కు 44 బోగీలతో ..

Trains Cancelled: పెద్దపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. 31 రైళ్లు రద్దు.. రద్దయిన రైళ్లు ఇవే..

South Central Railway

Updated On : November 13, 2024 / 9:20 AM IST

Peddpalli Train Accident: పెద్దపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ కు 44 బోగీలతో ఐరన్ రోల్స్ తో వెళ్తున్న గూడ్స్ రైలు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ కన్నాల రైల్వే గేట్ కు సమీపంలో మంగళవారం రాత్రి పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 11 బోగీలు బోల్తా పడ్డాయి. వేగంగా వెళ్తున్న రైలు బోగీల మధ్య ఉన్న లింక్ లు తెగిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో మూడు ట్రాక్ లు దెబ్బతిన్నాయి. ఘటన స్థలంకు చేరుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు.

Also Read: Gossip Garage : కాంగ్రెస్ టార్గెట్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు?

గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దు చేయడంతోపాటు పదికిపైగా రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. నర్సాపూర్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – నాగపూర్, హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్ – కాగజ్ నగర్, కాజీపేట – సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్ – కరీంనగర్, కరీంనగర్ – బోధన్, సిర్పూర్ టౌన్ – భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్ – బల్లార్షా, బల్లార్షా – కాజీపేట, యశ్వంత్ పూర్ – ముజఫర్ పూర్, కాచిగూడ – నాగర్ సోల్, కాచిగూడ – కరీంనగర్, సికింద్రాబాద్ – రామేశ్వరం, సికింద్రాబాద్ – తిరుపతి, అదిలాబాద్ – పర్లి, అకోలా – పూర్ణ, అదిలాబాద్ – నాందేడ్, నిజామాబాద్ -కాచిగూడ, గుంతకల్లు – బోధన్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.