Gossip Garage: ఫస్ట్ టైమ్.. మంత్రులపై సీరియస్, తీరు మారాల్సిందేనంటూ ఆర్డర్..! సీఎం రేవంత్ గుస్సాకు కారణం అదేనా?

ప్రభుత్వం ఏర్పడిన స్టార్టింగ్‌లో కాస్తో, కూస్తో సీఎంగా అండగా ఉంటూ..అపోజిషన్‌ మీద అటాక్ చేస్తుండే వారు మినిస్టర్లు. కానీ ఈ మధ్య పూర్తిగా మారిపోయారట.

Gossip Garage: ఫస్ట్ టైమ్.. మంత్రులపై సీరియస్, తీరు మారాల్సిందేనంటూ ఆర్డర్..! సీఎం రేవంత్ గుస్సాకు కారణం అదేనా?

Updated On : June 25, 2025 / 8:45 PM IST

Gossip Garage: ఇది కరెక్ట్ కాదు..మంత్రుల తీరు మారాల్సిందే. అంతా మీ చేతుల్లోనే పెట్టా. మీ చేతుల్లో ఉన్న పని కూడా చేయకుండా..ఏం పట్టించుకోకపోతే ఎట్లా? అంటూ మంత్రుల తీరుపై సీఎం రేవంత్‌ రెడ్డి గుస్సా కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. పార్టీ మీటింగ్‌లో ముఖ్యమంత్రి..మంత్రులను టార్గెట్ చేయడంపై సొంత పార్టీలోనే హాట్ హాట్‌ డిస్కషన్ జరుగుతోంది. ఆల్ ఆఫ్ సడెన్‌గా సీఎం..మంత్రులను ఎందుకు టార్గెట్ చేసినట్లు? రేవంత్‌రెడ్డి మాటల వెనుక ఇంటెన్షన్ వేరే ఉందా?

అసలే అధికార పార్టీ. పైగా సీఎం హాజరైన కార్యక్రమం. అంతకు మించి పార్టీ మీటింగ్. అక్కడ కాంగ్రెస్‌ లీడర్లంతా ఉన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా అదే డయాస్ మీద కూర్చున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో మైక్ అందుకున్న సీఎం రేవంత్‌..క్యాబినెట్ సహచరులపై తన మనసులో మాటను చెప్పేశారు. మీ పనితీరు బాలేదు. ఇట్లైతే కష్టం. అంటూ మంత్రులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

లీడర్ల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాల్సింది మీరే..!
గాంధీభవన్ వేదికగా జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో.. అమాత్యులను ఉద్దేశించి సీఎం చేసిన వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి. ఇంచార్జ్ మంత్రుల పనితీరు సరిగా లేదని..పనితీరు మార్చుకోవాలన్నారు సీఎం. పైగా కార్పొరేషన్ పదవుల విషయంలో ఇంచార్జ్ మంత్రులే చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో లీడర్ల మధ్య ఉన్న విభేధాలను పరిష్కరించాల్సింది కూడా మంత్రులే అంటూ తేల్చి చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 90 శాతం విజయం సాధించేలా మినిస్టర్లే బాధ్యత తీసుకోవాలన్నారు.

మంత్రులపై..పార్టీ వేదిక మీద సీఎం ఈ స్థాయిలో ఫైర్ అవడం ఇదే ఫస్ట్ టైమ్‌. ఏడాదిన్నర కాలంలో మంత్రులను డైరెక్ట్‌గా కానీ..ఇన్ డైరెక్ట్‌గా కానీ ఏ ఒక్కరోజు సీరియస్‌ కామెంట్స్ చేయలేదు సీఎం. పైగా మంత్రులకు వారి వారి శాఖల్లో పూర్తి స్వేచ్ఛను ఇచ్చానంటూ చెప్పుకొచ్చారు. కానీ పీఏసీ వేదికగా మంత్రులపై మొట్టమొదటిసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి.

Also Read: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. ఆ తేదీలోగా నిర్వహించాలని ఆదేశం..

ఈ స్థాయిలో ఫైర్‌ కావడానికి కారణం అదే..
అయితే సీఎం ఈ స్థాయిలో ఫైర్‌ కావడానికి కారణం లేకపోలేదనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది. విపక్షాల విమర్శలకు కౌంటర్‌ ఇవ్వకుండా మంత్రులంతా సైలెంట్‌గా ఉండిపోతున్నారట. ప్రభుత్వం, సీఎంపై ఎవరైనా విమర్శలు చేస్తే మొదటగా స్పందించాల్సిన మంత్రులే పట్టనట్లుగా ఉంటున్నారట. సీఎంను ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని తిప్పికొట్టేందుకు కూడా మంత్రులు ముందుకు రావడం లేదట.

అమాత్యులు కామ్‌గా ఉండటం సీఎంకు నచ్చడం లేదట..!
ప్రభుత్వం ఏర్పడిన స్టార్టింగ్‌లో కాస్తో, కూస్తో సీఎంగా అండగా ఉంటూ..అపోజిషన్‌ మీద అటాక్ చేస్తుండే వారు మినిస్టర్లు. కానీ ఈ మధ్య పూర్తిగా మారిపోయారట. తనను ఎవరైనా విమర్శిస్తే అమాత్యులు కామ్‌గా ఉండటం సీఎంకు నచ్చడం లేదట. ప్రతిపక్షాల విమర్శలకు కూడా సీఎంగా తానే సమాధానం చెప్పుకోవాలా అనే గుస్సా మీదున్నారట రేవంత్‌.

పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే..మునుముందు మరిన్ని చిక్కులు తప్పేలా లేవని ఆలోచనతో మంత్రులకు సీఎం చురుకలు అంటించారని అంటున్నారు. అదును చూసి పీఏసీ వేదికగా సీఎం..మంత్రులను టార్గెట్ చేశారని పార్టీలో డిస్కషన్ నడుస్తోంది. సీఎం రేవంత్ క్లాస్‌తో అయినా మంత్రులు దారిలోకి వస్తారా లేక షరామాములే అంటూ సైలెంట్‌గా ఉండిపోతారా అనేది చూడాలి.