Medicos Stipend: ఒక్కొక్కరికి లక్ష రూపాయలు.. మెడికోలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా స్టైఫండ్ పెంపు..
సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్‌లో రూ.1,06,461, సెకండ్ ఇయర్‌లో రూ.1,11,785, థర్డ్ ఇయర్‌లో రూ.1,17,103 చొప్పున స్టైఫండ్ అందనుంది.

Medicos Stipend: తెలంగాణలో మెడికోలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్టైఫండ్ ను భారీగా పెంచేసింది. ఒకేసారి 15 శాతం పెంచుతూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్‌తో పాటు సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం సైతం పెంచింది సర్కార్. ఇందుకు సంబంధించిన జీవో విడుదల చేసింది.
ఈ పెంపుతో ఇంటర్న్‌లకు నెలకు రూ.29,792 అందనుంది. పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్‌లో రూ.67,032, సెకండ్ ఇయర్‌లో రూ.70,757, ఫైనల్ ఇయర్‌లో రూ.74,782 చొప్పున స్టైఫండ్ అందనుంది. సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్‌లో రూ.1,06,461, సెకండ్ ఇయర్‌లో రూ.1,11,785, థర్డ్ ఇయర్‌లో రూ.1,17,103 చొప్పున స్టైఫండ్ అందనుంది. అలాగే, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.92,575 నుంచి రూ.1,06,461 పెంచింది ప్రభుత్వం.
Also Read: జర్నలిస్ట్ స్వేచ్ఛ కేసు.. పూర్ణచందర్ కు రిమాండ్.. చంచల్ గూడ జైలుకి తరలింపు..