New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్.. 2లక్షలకు పైగా కొత్త కార్డులు.. ఎప్పుడు ఇస్తారంటే..

మొత్తం 2లక్షలకు పైగా లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారని సమాచారం.

New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్.. 2లక్షలకు పైగా కొత్త కార్డులు.. ఎప్పుడు ఇస్తారంటే..

Updated On : July 1, 2025 / 8:38 PM IST

New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో కాలంగా ఎంతో ఆత్రుతగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది ప్రభుత్వం. ఈ నెల 14వ తేదీ నుంచి కొత్త కార్డులను పంపిణీ చేయనుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో 14వ తేదీన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మొత్తం 2లక్షలకు పైగా లబ్దిదారులకు కొత్త కార్డులు అందజేయనున్నారని సమాచారం. ఇప్పటికే అర్హత పొందిన దరఖాస్తుదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు.

రాష్ట్రంలో చాలా ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల మంజూరు నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డుల జారీ కోసం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది. కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా జారీ చేయాలి, అర్హతలు ఏంటి అనేదానిపై సబ్ కమిటీ పలు సూచనలు చేసింది. వీటికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త కార్డుల కోసం, అలాగే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను జత చేసేందుకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. వాటిని అధికారులు పరిశీలించి అర్హుల జాబితాను రూపొందించారు. కాగా, రేషన్ కార్డుల జారీ నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌షాక్.. వారి వేతనాల నుంచి 15శాతం కోత..

ఈసారి స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. బార్ కోడ్‌తో, సులభంగా యాక్సెస్ చేసేలా.. ఏటీఎం కార్డ్ తరహాలో స్మార్ట్ రేషన్ కార్డ్ ఉండనుందని తెలుస్తోంది. ఒక వైపు సీఎం ఫోటో, మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఫోటో, మధ్యలో తెలంగాణ ప్రభుత్వ లోగో ఉండేలా వీటిని డిజైన్ చేసినట్లు సమాచారం.