Governor Tamili Sai : రామాయంపేట, ఖమ్మం ఆత్మహత్య ఘటనలపై నివేదిక కోరిన గవర్నర్ తమిళి సై

ఈ ఘటనలపై వివరణాత్మక నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళి సై కోరారు. అలాగే కాళోజీ యూనివర్సిటీలోని మెడికల్ సీట్ల బ్లాక్‌ దందాపైనా నివేదిక ఇవ్వాలని... వీసీకి ఆదేశించారు.

Governor Tamili Sai : రామాయంపేట, ఖమ్మం ఆత్మహత్య ఘటనలపై నివేదిక కోరిన గవర్నర్ తమిళి సై

Governor (1)

Updated On : April 21, 2022 / 9:22 PM IST

Governor Tamili Sai : తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ దూకుడు పెంచారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పలు ఘటనలపై గవర్నర్‌… ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. రామాయంపేటలో తల్లీకొడుకుల ఆత్మహత్య.. ఖమ్మంలో సాయిగణేష్‌ ఆత్మహత్య ఘటనలపై గవర్నర్‌ తమిళి సై నివేదిక కోరారు. అలాగే భువనగిరి పరువు హత్య, కోదాడలో యువతిపై సామూహిక అత్యాచారం భయంకరమైన నేరాలుగా గవర్నర్‌ పేర్కొన్నారు.

Governor Tamilisai : సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం కష్టం : గవర్నర్ తమిళిసై మరోసారి కీలక వ్యాఖ్యలు

ఈ ఘటనలపై వివరణాత్మక నివేదికను ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళి సై కోరారు. అలాగే కాళోజీ యూనివర్సిటీలోని మెడికల్ సీట్ల బ్లాక్‌ దందాపైనా నివేదిక ఇవ్వాలని… వీసీకి ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఘటనలపై గవర్నర్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.