TS Governor: మీ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా.. ఆదివాసీలతో గవర్నర్ తమిళిసై ముఖాముఖీ

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో ముఖాముఖీ నిర్వహించారు.

TS Governor: మీ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా.. ఆదివాసీలతో గవర్నర్ తమిళిసై ముఖాముఖీ

TS Governor Tamilisai Soundararajan,

Updated On : May 17, 2023 / 1:00 PM IST

TS Governor: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు గవర్నర్‌కు ఘన‌స్వాగతం పలికారు. అనంతరం భద్రాచలం వీరభద్ర పంక్షన్ హాల్‌లో ఆదివాసీలతో తెలంగాణ గవర్నర్ తమిళ సై ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామాల ఆదివాసీల ప్రజలు వారి సమస్యలను గవర్నర్‌కు విన్నవించారు. అంధ్రలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరారు.

YS Sharmila : నలభై సీట్లు గెలుస్తదట షర్మిలక్క

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విన్నానని, వారి సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదివాసీల సమస్య పరిష్కార బాధ్యతలు అప్పగించారు. తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

CM KCR : బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ

అంతకుముందు గవర్నర్ తెలుగులో మాట్లాడారు.. అందరూ బావున్నారా, అందరూ బావుండాలని సీతారామ చంద్రస్వామిని ప్రార్ధించాను అంటూ తెలుగు‌లో మాట్లాడారు. తాను తమిళ ఆడబిడ్డనైనా తెలంగాణ ప్రజలకు అక్కనని అన్నారు.