ప్రియాంక కుటుంబసభ్యులను పరామర్శించిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హత్యాచారానికి గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇంటికి  వెళ్లారు. శంషాబాద్ లోని ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

  • Published By: veegamteam ,Published On : November 30, 2019 / 01:08 PM IST
ప్రియాంక కుటుంబసభ్యులను పరామర్శించిన గవర్నర్ తమిళిసై

Updated On : November 30, 2019 / 1:08 PM IST

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హత్యాచారానికి గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇంటికి  వెళ్లారు. శంషాబాద్ లోని ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హత్యాచారానికి గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇంటికి  వెళ్లారు. శంషాబాద్ లోని ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రియాంక రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

గుండె నిబ్బరం చేసుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు పోరాడుదామని వారికి తెలిపారు. దారుణానికి ఒడిగట్టిన హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

మరోవైపు ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అత్యాచారం, హత్య వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు.