రూ.5లకే అన్నం : ఒక్కరోజే 45 వేల మంది కడుపులు నింపిన అన్నపూర్ణ క్యాంటీన్లు

Greater Hyderabad 45000 Annapurna Meals Served To Needy On Today
Rs.5 Annapurna Canteens In GHMC :అన్నపూర్ణమ్మ అంటే అన్నం పెట్టి ఆకలితీర్చేది. అదే పేరుతో జీహెచ్ఎంపీ నిర్మించిన అన్నపూర్ణ క్యాంటీన్లు కేవలం రూ.లకే నిరుపేదల కడుపులు నింపుతోంది.ఈ క్రమంలో గురువారం (మే 13,2021) ఒక్కరోజే 45 వేల మంది కడుపులు నిపించింది. రోజువారీ కూలీలు, కార్మికులు, హాకర్లు, షెల్టర్ హోమ్స్‌లో ఆశ్రయం పొందేవారికి అన్నపూర్ణ క్యాంటీన్లు ఓ వరంగా మారాయి. జేబులో ఐదు రూపాయలు ఉంటే చాలు కడుపులు నింపుకోవచ్చనే భరోసానిచ్చాయి అన్నపూర్ణ క్యాంటీన్లు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాంటీన్లకు తోడుగా గురువారం డజన్ల సంఖ్యలో నూతన క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి.
గురువారం నగరంలోని 250 క్యాంటీన్లు వివిధ ప్రాంతాలలో 45 వేల మందికి పైగా ఆహారాన్ని అందించాయి. ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో ఇబ్బంది పడకూడదన్న ఆశయంతో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న క్యాంటీన్లకు అదనంగా మరో 102 క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ఇంకా చేస్తోంది. శుక్రవారం నుంచి ఇంకా కొత్త క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చి ఆకలితో ఉన్నవారి కడుపులు నింపుతాయని జీహెచ్ఎంసీ అధికారి తెలిపారు. ఈ కష్ట కాలంలో తమకింత భోజనం పెడుతున్న ప్రభుత్వానికి ఆకలి తీరినవారంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.