Sircilla Weavers: జాతీయ జెండాల తయారీలో బిజీగా సిరిసిల్ల నేతన్నలు.. జెండా పండుగతో భారీగా ఆర్డర్లు

సిరిసిల్ల జిల్లాలోని నేతన్నల ఇళ్లు సందడిగా కనిపిస్తున్నాయి. ప్రతి ఇల్లు త్రివర్ణ పతాకాల తయారీలో బిజీగా ఉంది. ఈసారి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన భారీ ఆర్డర్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్లు రావడంతో సిరిసిల్ల జిల్లా నేతన్నలు సంతోషంగా కనిపిస్తున్నారు.

Sircilla Weavers: జాతీయ జెండాల తయారీలో బిజీగా సిరిసిల్ల నేతన్నలు.. జెండా పండుగతో భారీగా ఆర్డర్లు

Sirisilla district

Updated On : August 12, 2023 / 5:46 PM IST

Sircilla Weavers Flags Order : జెండా పండుగ వచ్చిందంటే ఢిల్లీ నుంచి ప్రతి గల్లీలో జాతీయ జెండా (National Flag) ఎగరాల్సిందే.  వాటిని తయారు చేసే నేతన్నలో కొంతకాలం పని లేక ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయి.  జెండాలు తయారు (Flag Making) చేసే నేతన్నల ఇళ్లు ఇప్పుడు సందడిగా మారిపోయాయి.  ఆగస్టు 15కి ఎప్పుడూ వచ్చే ఆర్డర్లతో పాటు ఈసారి 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు (Independence Day 2023) ముగింపుకు రావడంతో పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయి. దాంతో సిరిసిల్లలోని ప్రతి ఇల్లు త్రివర్ణ పతాకాల (Tri Color Flag) తయారీలో బిజీగా ఉంది.

Independence Day 2023 : జాతీయ జెండా రంగుల్లో దుస్తులు ధరిస్తున్నారా? రూల్స్ పాటించకపోతే జైలు శిక్ష పడుతుంది

తెలంగాణ ప్రభుత్వం ఈసారి స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలని సంకల్పించింది. కోటి 20 లక్షల జాతీయ జెండాలను పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్లు ఇచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 25 వేలకి పైగా మరమగ్గాలతో పాటు పవర్ లూమ్స్ కూడా ఉన్నాయి. వీటిపై 30లక్షల మీటర్ల పాలిస్టర్ తెలుపు రంగు వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. జెండాల తయారికీ అవసరమైన తెలుపు రంగు పాలిస్టర్ వస్త్రాన్ని గుజరాత్ వస్త్ర పరిశ్రమల నుంచి సేకరిస్తున్నారు. హైదరాబాద్‌లో మూడు రంగుల జెండాలు ప్రింట్ చేయిస్తున్నారు. ఆ తర్వాత సిరిసిల్లలోనే కట్టింగ్, స్టిచ్చింగ్‌తోపాటు ప్యాకింగ్‌ చేస్తున్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఈసారి సిరిసిల్ల కార్మికులకు చేతినిండా పని దొరకడంతో ఫుల్ బిజీలో ఉన్నారు.

పాలి మరమగ్గాలపై జెండాల తయారీకి ఉపయోగించే పాలిస్టర్ వస్త్రం, పాలిస్టర్ నూలు పోగులతో ఒక జెండా సైజ్ 20/30 ఇంచులతో ఉన్న వస్త్రాన్ని సేకరించాలని టెస్కోకి సూచన చేసింది. తొలి విడతగా 36 లక్షలు సేకరించాలని సూచించింది. గతేడాది మీటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఒక జెండాకి  రూ. 12 చెల్లించి కొనుగోలు చేసింది. సిరిసిల్ల నేత కార్మికులు ఇప్పుడు 12 రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 10 కోట్ల రూపాయల విలువైన జాతీయ జెండాలను తయారు చేస్తున్నారు. దాదాపు 5,000 పవర్ లూమ్‌లపై 2 వేల మందికి పైగా పని చేస్తున్నారు.

Flag of India : జాతీయ జెండా ఎగరవేసేటపుడు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి

ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాలు సిరిసిల్లలో జాతీయ జెండాలకు ఆర్డర్లు ఇచ్చాయి. ఒక జెండా కుట్టడానికి ప్రభుత్వం ఒక రూపాయి ఇస్తుండగా… ప్రతిరోజు 2 వేల జెండాలు కుడుతున్నారు. ఈసారి ఆర్డర్లు కూడా పెరగడంతో విద్యార్థులు సైతం ఇక్కడ పని చేస్తున్నారు. 7 నుంచి 8 గంటలు పనిచేస్తే వారికి  రూ.500 లతో పాటు భోజనం కూడా పెడుతున్నారు.

ఒకప్పుడు ఉపాధి లేక వలస పోయిన నేతన్నల కుటుంబాలు… ఇప్పుడు చేతినిండా పని దొరకడంతో సంబరపడుతున్నారు. దీంతో వలసలు తగ్గడమే కాదు.. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సైతం తిరిగి ఇంటిబాట పడుతున్నారు. ఇతర రాష్ట్రాల కూలీలు సైతం సిరిసిల్లకు వచ్చి ఉపాధి పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీరల ఆర్డర్లతో పాటుగా.. రాజకీయ పార్టీల జెండాల తయారీ ఆర్డర్లతో కార్మికులు బిజీబిజీగా ఉన్నారు. ఇది నిజంగా వారి జీవితాల్లో శుభపరిణామంగా చెప్పాలి.