బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుపై హరీశ్ రావు ఫస్ట్ రియాక్షన్

ఒక రౌడీ షీటర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు కౌశిక్‌ రెడ్డిని అరెస్టు చేశారని అన్నారు.

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుపై హరీశ్ రావు ఫస్ట్ రియాక్షన్

Updated On : January 13, 2025 / 8:19 PM IST

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుపై తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని 10 టీవీ ఆఫీసులో ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వెళ్తున్న సమయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్‌ తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

ఈ అరెస్టుపై హరీశ్ రావు 10 టీవీతో మాట్లాడుతూ… తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని అన్నారు. ఒక రౌడీ షీటర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు కౌశిక్‌ రెడ్డిని అరెస్టు చేశారని అన్నారు. పండుగ రోజు ఉద్దేశపూర్వకంగానే ఆయనను అరెస్టు చేశారని చెప్పారు.

కాంగ్రెస్‌ సర్కారు పాలనలో తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ 23 శాతం పెరిగిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని తెలిపారు. ఒకే కేసులో కౌశిక్‌ రెడ్డిపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని అన్నారు.

కాగా, కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు మొత్తం 35 మంది పోలీసులు వచ్చారు. కరీంనగర్‌ జిల్లా జడ్జి ఎదుట కౌశిక్‌ రెడ్డిని మొదట పోలీసులు హాజరుపరుస్తారు.

Kaushik Reddy: 10 టీవీ ఆఫీసు వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్