తెలంగాణ ప్రభుత్వ రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై హరీశ్ రావు స్పందన

రుణమాఫీ పథకం అమలు విషయంలో విడుదల చేసిన మార్గదర్శకాల ద్వారా రైతుల వలపోతల..

తెలంగాణ ప్రభుత్వ రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై హరీశ్ రావు స్పందన

Harish Rao Comments On Congress

Updated On : July 16, 2024 / 4:31 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణలో భూమి కలిగివున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుందని, ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకని సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే.

మార్గదర్శకాలపై హరీశ్ రావు ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. రుణమాఫీ పథకం అమలు విషయంలో విడుదల చేసిన మార్గదర్శకాల ద్వారా రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నదని స్పష్టమవుతోందని చెప్పారు. ఎన్నికల వేళ ఒక మాట చెప్పి, అధికారంలోకి వచ్చాక మరో మాట చెబుతున్నారని అన్నారు.

చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందని తెలిపారు. 2018, డిసెంబర్ 12 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసమని చెప్పారు. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతున్నదని తెలిపారు. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేనని చెప్పారు.

 Also Read: గుడ్‌న్యూస్.. పంటల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం