జలదోపీడీ మళ్లీ మొదలైంది.. బనకచర్ల ప్రాజెక్టును ఆపేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి.. హరీశ్ రావు డిమాండ్

గోదావరి పై తెలంగాణ ప్రాజెక్టులు చేపడితే ఎందుకు అడ్డుకుంటున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనేక లేఖలు రాశారు.

జలదోపీడీ మళ్లీ మొదలైంది.. బనకచర్ల ప్రాజెక్టును ఆపేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి.. హరీశ్ రావు డిమాండ్

Harish Rao

Updated On : May 25, 2025 / 2:59 PM IST

Banakacherla Project: తెలంగాణ సాగునీటి ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన జలదోపిడి మళ్ళీ ఇప్పుడు మొదలైంది. 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయే కుట్ర జరుగుతోందని హరీశ్ రావు అన్నారు.

Also Read: అన్న ఆధిపత్యాన్ని సవాల్ చేయడం కోసమే కవిత లేఖ.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్

గోదావరి పై తెలంగాణ ప్రాజెక్టులు చేపడితే ఎందుకు అడ్డుకుంటున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనేక లేఖలు రాశారు. ఏ ఒక్క అనుమతి లేకుండానే ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్టును చేపట్టింది. తెలంగాణకు ఇంత నష్టం జరుగుతుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమి చేస్తున్నారంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. మన నీళ్లను ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుంటే కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు మాట్లాడటం లేదు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు భాద్యత లేదా..? మీకు పదవులే ముఖ్యమా.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా..? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

 

బనకచర్ల ప్రాజెక్టును ఆపకపోతే ఢిల్లీలోని సీడబ్ల్యుసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ సాగునీటి ప్రయోజనాల కోసం కేసీఆర్ సూచన మేరకు పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అఖిలపక్షం సమావేశం నిర్వహించాలి. గోదావరిపై ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును ఆపేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.