Harish Rao: రేవంత్ రెడ్డి.. ఒక్కసారి ఆ విషయాలను గుర్తుచేసుకో: హరీశ్ రావు
అప్పట్లో సోనియా గాంధీని రేవంత్ రెడ్డి బలి దేవత అన్నారని, ఇప్పుడేమో దేవత అంటున్నారని చెప్పారు.

Harish Rao
Ramayampet: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా, రామాయంపేటలో హరీశ్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్ల కాలం వస్తుందని చెప్పారు. రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై చర్చకు రావాలని సవాలు విసిరారు. అప్పట్లో సోనియా గాంధీని రేవంత్ రెడ్డి బలి దేవత అన్నారని, ఇప్పుడేమో దేవత అంటున్నారని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో గుర్తు చేసుకోవాలని అన్నారు. ఆనాడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పై ఎన్నో కామెంట్స్ చేశారని చెప్పారు.
రేవంత్ రెడ్డి మార్చే ఊసరవెల్లి అని అన్నారు. ఎన్నికల్లో డబ్బు ఉన్నవారు కాదని, జనబలం ఉన్నవాళ్లు గెలుస్తారని చెప్పారు. ఇతర పార్టీలు ఒట్టి మాటలే చెబుతాయని, కేసీఆర్ అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు. ఎన్నికల వేళ కొన్ని పార్టీల నేతలు డబ్బుల సంచులతో వస్తున్నారని, సంక్రాంతి పండుగ ముందు గంగిరెద్దువాళ్లు బయలుదేరినట్టు బయలుదేరారని వ్యాఖ్యానించారు.
Nara Lokesh: నా భార్య, నా తల్లిపై కూడా కేసులు పెట్టి జైలుకి పంపుతారట: నారా లోకేశ్