Nara Lokesh: నా భార్య, నా తల్లిపై కూడా కేసులు పెట్టి జైలుకి పంపుతారట: నారా లోకేశ్
చంద్రబాబుకు బెయిల్ వస్తుందని భావించి, మరో మూడు కేసులను సిద్ధం చేశారని ఆరోపించారు.

Nara Lokesh
Nara Lokesh: వైసీపీ తీరుపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. తన భార్య బ్రాహ్మణి, తన తల్లి నారా భువనేశ్వరిపై కూడా కేసులు పెట్టి జైలుకి పంపుతామని బెదిరిస్తున్నారని నారా లోకేశ్ తెలిపారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఇవాళ లోకేశ్ చేపట్టిన దీక్ష ముగిసింది.
అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుడని, ఎంతో పారదర్శకంగా పనులు చేస్తారని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు ఓ తెలివిలేని వ్యక్తి సీఎంగా ఉన్నారని, పేరున్న రాజకీయ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు.
తనపై కూడా తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. చంద్రబాబును 24 రోజులుగా జైలులో ఉంచారని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు బెయిల్ వస్తుందని భావించి, మరో మూడు కేసులను సిద్ధం చేశారని ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదని, అయినప్పటికీ తనకు నోటీసులు ఇచ్చారని అన్నారు. తనకు సంబంధం లేని వాటిల్లో తనపై కేసులు పెట్టారని తెలిపారు.
Ka Paul: పాదయాత్రకు సిద్ధమైన కేఏ పాల్.. దమ్ముంటే ఆపండి చూద్దామంటూ..