Harish Rao Thanneeru : తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రికి హరీశ్ రావు ఫిర్యాదు

Harish Rao Thanneeru : విభజన చట్టం సెక్షన్ 3 కింద నూతన కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరారు.

Harish Rao Thanneeru : తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రికి హరీశ్ రావు ఫిర్యాదు

Harish Rao Thanneeru(Photo Twitter, Google)

Updated On : July 11, 2023 / 9:01 PM IST

Harish Rao Thanneeru – Polavaram : తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. పోలవరం ప్రాజెక్టు విస్తరణ విషయంలో జగన్ సర్కార్ తీరుపై కేంద్ర జల్ శక్తి మంత్రికి హరీశ్ రావు కంప్లైంట్ చేశారు. పరిమితికి మించి పోలవరం విస్తరణ పనులు చేపడుతున్నారని, ఏపీ ప్రభుత్వ పనులపై దృష్టి సారించాలని కేంద్రమంత్రిని కోరారు హరీశ్ రావు. గోదావరి జిలాల్లో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా ఏపీ ప్రభుత్వ పనులున్నాయని షెకావత్ కు ఫిర్యాదు చేశారాయన. జాతీయ ప్రాజెక్టుగా ఉన్నందున పోలవరం పనులపై దృష్టి సారించాలని కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారాయన.

తెలంగాణ మంత్రి హరీశ్ రావు మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ ను కలిశారు. ఆయనతో అరగంట పాటు సమావేశం అయ్యారు. విభజన చట్టం సెక్షన్ 3 కింద నూతన కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని కోరారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు హరీశ్ రావు తెలిపారు.

Also Read..Revanth Reddy : తెలంగాణలో దుమారం రేపుతున్న రేవంత్ రెడ్డి ‘ఉచిత కరెంట్’ వ్యాఖ్యలు

”గతంలో సుప్రీంకోర్టులో కేసును ఉపసంహరించుకుంటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సమ్మక్క సారక్క, సీతమ్మ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలి. పాలమూరు ప్రాజెక్టుకు కూడా అనుమతి ఇవ్వాలి. ప్రాజెక్టుల డీపీఆర్ లను కేంద్రమంత్రికి సమర్పించారు హరీశ్ రావు. పోలవరం కాలువ సైజ్ పెంచడం వల్ల తెలంగాణ వాటాకు అన్యాయం జరుగుతుంది. కృష్ణా వాటర్ లో ఏపీకి, తెలంగాణకి 50 శాతం నీళ్లు ఇవ్వాలి. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పరిహారం రూ.700 కోట్లు విడుదల చేయాలని జీఎస్టీ మండలిలో కోరాం. జీఎస్టీని పిఎంఎల్ఏ చట్టం కిందికి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నాము” అని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

Also Read..Sircilla Constituency: సిరిసిల్లలో కేటీఆర్‌ను ఢీకొట్టేందుకు విపక్షాలు వేస్తున్న ఎత్తులేంటి.. బీజేపీ నుంచి పోటీచేసేదెవరు?