Heat Waves : తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వడగాలులు.. వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ
రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాతావరణ విశ్లేషణ మరియు హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 8:30 ఆధారంగా వాతావరణ హెచ్చరికలు చేసింది.

Heat Waves
Weather Warnings : రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీయనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడు రోజులు కొన్ని జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడగాలులు రావడానికి ఎక్కువ అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు వాతావరణం కేంద్రం ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.
రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాతావరణ విశ్లేషణ మరియు హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 8:30 ఆధారంగా వాతావరణ హెచ్చరికలు చేసింది.
Telangana Rains : తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
రాగల రెండు రోజులు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.