Heavy Flood Water : గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు.. మూసారంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జీలను తాకుతూ మూసి వరద ప్రవాహం
వికారాబాద్, తాండూర్, శంకర్ పల్లి, షాద్‌నగర్, షాబాద్ నుండి భారీగా వరద నీరు చేరుతోంది. ఈసీ, మూసీ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 కాగా ప్రస్తుతం 1763.50 గా కొనసాగుతోంది.

Heavy flood water
Gandipet – Himayat Sagar : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో జంట జలాశయాలు నిండు కుండలుగా మారాయి. గండిపేట, హిమాయత్ సాగర్ కు వరద ప్రవాహం భారీగా చేరుతోంది. ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
వికారాబాద్, తాండూర్, శంకర్ పల్లి, షాద్‌నగర్, షాబాద్ నుండి భారీగా వరద నీరు చేరుతోంది. ఈసీ, మూసీ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 కాగా ప్రస్తుతం 1763.50 గా కొనసాగుతోంది. 1600 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది.
IMD Issues Red Alert : వచ్చే ఐదు రోజులపాటు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఐఎండీ రెడ్ అలర్ట్
4 గేట్లను 2 ఫీట్ల మేరా పైకి ఎత్తి 1375 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. గండిపేట జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1790 కాగా, ప్రస్తుతం 1786.60 గా కొనసాగుతోంది. మూసారంబాగ్, చాదర్ ఘాట్ లో మూసి బ్రిడ్జిని తాకుతూ వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది.