Hyderabad : భారీ వర్షాల ఎఫెక్ట్.. హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలకు పోలీసుల కీలక ఆదేశాలు, ఉద్యోగులు ఇంటికి వెళ్లేందుకు టైమింగ్స్

ఉద్యోగులు అందరూ ఒక్కసారిగా బయటకు రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎటుచూసినా రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. Hyderabad Traffic

Hyderabad : భారీ వర్షాల ఎఫెక్ట్.. హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలకు పోలీసుల కీలక ఆదేశాలు, ఉద్యోగులు ఇంటికి వెళ్లేందుకు టైమింగ్స్

Hyderabad Traffic

Hyderabad Traffic : భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ జామ్ సమస్యకు చెక్ పెట్టేలా వ్యూహం రచించారు. ట్రాఫిక్ జామ్ పద్మవ్మూహాన్ని చేధించేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా ఐటీ కంపెనీల ఉద్యోగులు షిఫ్ట్ ల వారీగా లాగౌట్ కావాలని సూచించారు. ఐటీ కంపెనీలకు పోలీసులు పలు సూచనలు చేశారు. రెండు రోజుల పాటు దశలవారిగా మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు లాగౌట్ అయ్యేలా చూడాలన్నారు.

ఐకియా నుంచి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు మధ్యాహ్నం 3గంటలకు లాగౌట్ చేసుకోవాలని సూచించారు. ఐకియా నుంచి బయోడైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4.30గంటలకు లాగౌట్ అవ్వాలని చెప్పారు. ఇక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు మధ్యాహ్నం 3గంటలకు లాగౌట్ చేసుకోవాలన్నారు.

Also Read..YS Sharmila: వైఎస్ షర్మిల బాణం కాంగ్రెస్ చేతికి చిక్కిందా.. అందుకే సికింద్రాబాద్ సీట్‌పై కన్నేశారా?

సోమవారం నగరంలో వాన దంచికొట్టింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షం కారణంగా ఐకియా పరిసర ప్రాంతాలతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉద్యోగులు అందరూ ఒక్కసారిగా బయటకు రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎటుచూసినా రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆయన నేరుగా ఫీల్డ్ లోకి వచ్చినా అర్థరాత్రి వరకు కానీ పరిస్థితి అదుపులోకి రాలేదంటే ట్రాఫిక్ జామ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read..Nirmaan Org: సైబరాబాద్ కమిషనరేట్‌ పోలీసులకు 1200 రెయిన్‌కోట్‌ల పంపిణీ

ఐటీ ఉద్యోగులకు లాగౌట్ టైమ్స్ ఇలా..
ఫేజ్-1
ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.

ఫేజ్-2
ఐకియా నుండి బయో డైవర్సిటీ, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.

ఫేజ్-3
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి.