Heavy Rains: ఈ జిల్లాల్లో 4 రోజుల పాటు వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

హైదరాబాద్​లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Heavy Rains: ఈ జిల్లాల్లో 4 రోజుల పాటు వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

Rain

Updated On : April 2, 2025 / 10:44 AM IST

ఎండల కారణంగా ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లని కబురు. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. చత్తీస్​గఢ్, మహారాష్ట్రల మీదుగా ఉపరితల ఆవర్తనం, దానికి ఆనుకుని ద్రోణి కొనసాగుతోంది.

మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మీదుగానూ మరో ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వానలు పడతాయని ఐఎండీ చెప్పింది. ఇవాళ, రేపు వడగండ్ల వాన పడవచ్చని పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వివరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Also Read: ఇండియాలో టాప్ సెల్లింగ్ కార్లు ఇవే.. ఎగబడి కొంటున్న జనం

ఇవాళ, రేపు ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల్లో వర్షాలు పడొచ్చని తెలిపింది.

వచ్చే శుక్ర, శనివారాల్లో రెండు రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్​లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీల మధ్య తగ్గే అవకాశం ఉందని వివరించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిన్న 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.