Dog Attack Case : జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే పసివాడి ప్రాణాలు పోయాయని హైకోర్టు ఆగ్రహం

హైదరబాద్ లోని అంబర్ పేటలో కుక్కలదాడిలో పసివాడు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జీహెచ్ఎంసీ నిర్లక్షం వల్లే పసివాడి ప్రాణాలు పోయాయని హైకోర్టు సీరియస్ అయ్యింది. కుక్కల దాడి ఘటనలో పసివాడు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విచారణ చేపట్టిన హైకోర్టు జీహెచ్ఎంసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.

Dog Attack Case :  జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే పసివాడి ప్రాణాలు పోయాయని హైకోర్టు ఆగ్రహం

High Court fire on the incident of dog attack in Amber Peta..Hyderabad

Updated On : February 23, 2023 / 4:23 PM IST

Dog Attack Case In hyderabad : హైదరబాద్ లోని అంబర్ పేటలో కుక్కలదాడిలో పసివాడు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జీహెచ్ఎంసీ నిర్లక్షం వల్లే పసివాడి ప్రాణాలు పోయాయని హైకోర్టు సీరియస్ అయ్యింది. కుక్కల దాడి ఘటనలో పసివాడు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విచారణ చేపట్టిన హైకోర్టు జీహెచ్ఎంసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇటువంటి ఘటనలు జరుగుతునే ఉన్నాయి. అయినా మీ నిర్లక్ష్యం వీడటంలేదు.

ఇటువంటి ఘటనలో మరోసారి జరగకుండా ఉండటానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలంటూ నోటీసులు జారీ చేసింది. బాలుడిపై కుక్కల దాడి కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు తెలంగాణ చీఫ్ సెక్రటరీ,జీహెచ్ఎంసీ, హైదరాబాద్ కలెక్టర్,అంబర్ పేట మున్సిపల్ అధికారికి నోటీసులు జారీ చేసింది.దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.

Dog Bite Control Guidelines: అంబర్‌పేట ఘటనపై ప్రభుత్వం సీరియస్.. కుక్క కాటు నియంత్రణకు మార్గదర్శకాలు జారీ

హైదరాబాద్‌ నగరం అంబర్ పేటలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాలుడిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో మృతిచెందాడు. కుక్కలు బాలుడిపై దాడిచేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఘటన అనంతరం భాగ్యనగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందని, వాటి నిర్మూలనలో ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీధి కుక్కలు బాలుడిపై దాడిచేసిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మరెవరికి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా కుక్క కాటు నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 13 పాయింట్స్‌తో ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.

Cases of dog bites: వీధిలో పిచ్చి కుక్క బీభత్సం.. 10 మందికి గాయాలు