Telangana High Court : డిప్లొమా కోర్సుల ఫీజుల నియంత్రణపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
డిప్లొమా కోర్సుల ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి )హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

TS High court
Telangana High Court : డిప్లొమా కోర్సుల ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Govt)హైకోర్టు (High Court)ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి (Education Secretary )వాకాటి కరుణ (Vakati Karuna)నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. డిప్లొమా కోర్సులను ఏఎఫ్‌ఆర్‌సీ (AFRC)పరిధిలోకి తేవాలని గతేడాది సాంకేతిక విద్య శాఖ (Department of Technical Education)ప్రతిపాదనలు పంపింది. సాంకేతిక విద్యా శాఖ ప్రతిపాదనలపై 2022 ఫిబ్రవరి నుండి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈక్రమంలో కౌన్సెలింగ్ ప్రారంభమైనందున ఫీజులు పెంచాలని హైకోర్టులో ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు (private polytechnic colleges)పిటిషన్ దాఖలు (Petition filed)చేశాయి. వీటిని విచారణకు స్వీకరించిన ధర్మాసనం దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించినా కానీ విద్యాశాఖ కార్యదర్శి (Education Secretary )స్పందించకపోవటంతో కోర్టు అసహనం వ్యక్తంచేసింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.
దీనిపై వారంలోగా విద్యా శాఖ నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనిపై ధర్మాసనం విద్యాశాఖ కార్యదర్శి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించలేదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.పాలిటెక్నిక్ కాలేజీలు కోరినట్లుగా ఫీజుల పెంపునకు అనుమతించక తప్పడం లేదన్న హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఫీజు రూ.40వేలకు పెంచేందుకు 5 పాలిటెక్నిక్ కాలేజీలకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వం తక్కువగా ఫీజు ఖరారు చేస్తే విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని కాలేజీలకు హైకోర్టు షరతు విధించింది. అనంతరం ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల ఫీజులపై తదుపరి విచారణను జూన్ 26కి వాయిదా వేసింది.