Mla Padi Kaushik Reddy : కౌశిక్ రెడ్డి అరెస్ట్.. కరీంనగర్ లో పోలీసుల భారీ బందోబస్తు.. ఎక్కడికక్కడ అరెస్టులు..
సిటీకి వెళ్లే అన్ని రహదారుల్లో పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు.

Kaushik Reddy
Mla Padi Kaushik Reddy : పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అక్కడ భారీగా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. కాగా, కౌశిక్ రెడ్డిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే విషయంలో సందిగ్దత నెలకొంది. మంగళవారం ఉదయం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచే అవకాశం ఉందని తెలుస్తోంది.
కౌశిక్ రెడ్డి అరెస్ట్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు. కరీంనగర్ లో భారీగా బందోబస్త్ ఏర్పాటు చేశారు. సిటీకి వెళ్లే అన్ని రహదారుల్లో పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డి కోసం వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. రాజన్న సిరిసిల్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్యను కొదురుపాక వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు..
ఊహించని పరిణామం.. 10టీవీ ఆఫీస్ దగ్గర పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 10టీవీ ఇంటర్వ్యూ అనంతరం బయటకు వెళ్తున్న కౌశిక్ రెడ్డిని.. 10టీవీ ఆఫీస్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి కరీంనగర్ తరలించారు.
Also Read : రూ.5 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ హౌస్.. ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో వివాదం నేపథ్యంలో 10టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూకి వచ్చారు పాడి కౌశిక్ రెడ్డి. ప్రభుత్వ విధానాలపై, తనపై వస్తున్న కామెంట్స్, రూమర్స్ పై టెన్ టీవీ వేదికగా స్పందించారు.
లేటెస్ట్ గా కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన సమీక్షలో జరిగినటువంటి గొడవపై వివరంగా చెప్పారు. ఇంటర్వ్యూ ముగించుకుని వెళ్లేందుకు టెన్ టీవీ ఆఫీస్ బయటకు వెళ్లిన వెంటనే కరీంనగర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ ఆయనను చుట్టుముట్టారు. ఏమవుతుందో తెలుసుకునే లోగానే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 35 మంది పోలీసు సిబ్బంది కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
సైలెంట్ గా ఆయనను టెన్ టీవీ ఆఫీస్ ముందు పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. వెంటనే భారీ బందోబస్తు నడుమ కరీంనగర్ కు తరలించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగానే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఎసిపోడ్ హైడ్రామాను తలపించింది.
Also Read : కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్