Indiramma Model House : రూ.5 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ హౌస్.. ఇందిర‌మ్మ మోడ‌ల్‏ హౌస్‌ ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుంది.

Indiramma Model House : రూ.5 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ హౌస్.. ఇందిర‌మ్మ మోడ‌ల్‏ హౌస్‌ ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

Updated On : January 13, 2025 / 9:53 PM IST

Indiramma Model House : ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇందిరమ్మ మోడల్ హౌస్ ను(నమూనా ఇందిరమ్మ ఇల్లు) రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. జనవరి 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ స్కీమ్ ను అమలు చేయనుంది ప్రభుత్వం. ఈ మోడల్ హౌస్ ను 5లక్షల వ్యయంతో నిర్మించారు గృహ నిర్మాణ శాఖ అధికారులు. ఇలానే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టనుంది ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుంది. మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కూసుమంచిలో మొదటగా నమూనాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఒక ఇంటి నిర్మాణం చేపట్టారు. కూసుమంచి ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో మోడల్ హౌస్ నిర్మాణం చేశారు. ఈ పథకం కింద రూ.5లక్షలు ఇస్తారు. ఆ డబ్బుతో లబ్దిదారులు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకునే విధంగా పరిస్థితి ఉంది.

ఇంటి నిర్మాణానికి ఎంత మెటీరియల్ అవసరం అవుతుంది? దానికి అయ్యే ఖర్చు ఎంత? అనే పూర్తి వివరాలు ఈ నమునా ఇంటి మీద అధికారులు పొందుపరిచారు. జనవరి 26 నుంచి ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.

”రూ.5 లక్షల ఖర్చుతో ఇంటి నిర్మాణం సాధ్యమవుతుంది. అది సాధ్యమే అని చెప్పడానికే ఈ నమూనా ఇంటిని నిర్మించడం జరిగింది. అదే కాస్ట్ తో అదే లోకల్ మెటీరియల్ వాడుకుని రూ. 5లక్షల ఖర్చుతో ఇంటి నిర్మాణం పూర్తి చేశాం. లబ్దిదారుల విషయంలో అయితే బేస్ మెంట్ కు లక్ష రూపాయలు. శ్లాబ్ వేసిన తర్వాత గోడలకు లక్ష రూపాయలు. శ్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు. పూర్తైన తర్వాత లక్ష రూపాయలు ఇస్తారు” అని గృహనిర్మాణ శాఖ అధికారి తెలిపారు.

Also Read : 10 టీవీ ఆఫీసు వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్