himanshu tweet : తప్పుడు వార్తలు రాయొద్దన్న కేసీఆర్ మనవడు

  • Published By: madhu ,Published On : October 2, 2020 / 09:40 AM IST
himanshu tweet : తప్పుడు వార్తలు రాయొద్దన్న కేసీఆర్ మనవడు

Updated On : October 2, 2020 / 9:52 AM IST

himanshu tweet : తెలంగాణ సీఎం KCR మనువడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి KTR కుమారుడు హిమాన్షుకు సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అతని ఆరోగ్యంపై పుకార్లు షికారు చేశాయి. దీంతో హిమాన్షు స్పందించాడు. చెత్త వార్తలు రాయొద్దని సూచించాడు.



ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. కొన్ని పత్రికలు ఫేక్ రూమర్స్ ప్రచారం చేస్తున్నాయని వెల్లడించాడు. తన కాలు కొద్దిగా బెణికిందని, ప్రస్తుతం నడుస్తున్నట్లు, రేపు రన్నింగ్ చేస్తానని చెప్పాడు. అయితే..తన ఆరోగ్యంపై వార్తలు రాసే సాహసం చేయకండి..థాంక్యూ అంటూ ట్వీట్ చేశాడు.



సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు గాయమైందని, కనీసం నిల్చోలేకపోతున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించాయి. తుంటి ప్రాంతంలో, మోకాలికి ఫ్రాక్చర్‌ అయినట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో హిమాన్షు స్పందించాల్సి వచ్చింది. తన ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించాడు.