Siva Balakrishna Case : అరవింద్ కుమార్ ఆదేశాలతోనే..! శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు
డిసెంబర్ నెలలో బాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ కు కోటి రూపాయలు అందాయి. జూబ్లీహిల్స్ లోని అరవింద్ కుమార్ నివాసానికి వెళ్లి ఆ మొత్తాన్ని బాలకృష్ణ అందజేశాడు.

Siva Balakrishna Case
Siva Balakrishna Case Update : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఏసీబీ కస్టడీలో శివ బాలకృష్ణ వాగ్మూలం నివేదికలో ఓ ఐఏఎస్ అధికారి పేరును ప్రస్తావించారు. బాలకృష్ణ ద్వారా ఐఏఎస్ అరవింద్ కుమార్ తనకు కావాల్సిన బిల్డింగ్ కు అనుమతులు జారీ చేయించుకున్నట్లు తేలింది. నార్సింగిలోని ఒక కంపెనీ వివాదాస్పద భూమికి సంబంధించి బాలకృష్ణ క్లియరెన్స్ ఇచ్చాడు. అరవింద్ కుమార్ ఆదేశాలతోనే 12 ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇచ్చినట్లు శివ బాలకృష్ణ కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో పేర్కొన్నాడు. నార్సింగ్ లోని ఎస్ఎస్వీ ప్రాజెక్ట్ అనుమతికోసం రూ. 10కోట్లను ఐఏఎస్ అరవింద్ కుమార్ డిమాండ్ చేసినట్లు.. డిమాండ్ చేసిన 10కోట్లలో కోటి రూపాయలను షేక్ సైదా అనే వ్యక్తి చెల్లించాడు.
Also Read : Former MLA Balka Suman : పరారీలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్.. పోలీసుల గాలింపు
డిసెంబర్ నెలలో బాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ కు కోటి రూపాయలు అందాయి. జూబ్లీహిల్స్ లోని అరవింద్ కుమార్ నివాసానికి వెళ్లి ఆ మొత్తాన్ని బాలకృష్ణ అందజేశాడు. మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతికోసం అరవింద్ కుమార్ రూ. కోటి డిమాండ్ చేశాడు. మహేశ్వరం మండల్ మంకల్ వద్ద వర్టేక్స్ భూములకు సంబంధించిన వ్యవహారంలో అరవింద్ కుమార్, బాలకృష్ణలు ఫేవర్ చేశారు. ఫలితంగా వర్టేక్స్ లో ఒక ప్లాట్ అరవింద్ కుమార్ పేరిట బహుమానంగా అందుకున్నట్లు వెలుగులోకి వచ్చింది.