HMDA Demolitions : రూ.45కోట్ల విలువైన 3ఎకరాల భూమి కబ్జా.. కొరడా ఝళిపించిన HMDA

HMDA Demolitions: హెచ్ఎండీఏ భూముల జోలికొస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. ఆక్రమణదారులపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు

HMDA Demolitions : రూ.45కోట్ల విలువైన 3ఎకరాల భూమి కబ్జా.. కొరడా ఝళిపించిన HMDA

HMDA Demolitions

Updated On : May 6, 2023 / 9:42 PM IST

HMDA Demolitions : హెచ్ఎండీఏ భూముల జోలికొస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. పెద్ద అంబర్ పేట్ పరిధిలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు. రూ.45 కోట్ల విలువైన 3 ఎకరాలను కబ్జాదారుల బారి నుంచి రక్షించారు. ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Also Read..Vemulawada Constituency: బండి సంజయ్ కాకపోతే.. వేములవాడలో బీజేపీ నుంచి పోటీ చేసేదెవరు?

ఔటర్ రింగ్ రోడ్డు భవిష్యత్ అవసరాల కోసం ఆర్ అండ్ ఆర్ కింద సేకరించిన 3 ఎకరాల స్థలంపై కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. విజయవాడ జాతీయ రహదారి సమీపంలో ఈ భూమి ఉంది. ఇందులో నిర్మాణ దశలో ఉన్న 5 ఇళ్లు, ప్రహరీ గోడలను, గేట్లను అధికారులు ధ్వంసం చేశారు. ఆక్రమణదారులపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హెచ్ఎండీఏ భూముల జోలికొస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు వార్నింగ్ ఇచ్చారు.