మరో లేడీ విలన్.. కూల్ డ్రింక్‌లో గడ్డిమందు కలిపి భర్తను చంపిన భార్య.. ఆ తర్వాత..
కొద్దిసేపటి తర్వాత గొంతులో మంట రావడంతో అరుపులు పెట్టాడు. భర్త చనిపోతాడని భావించి భార్య పారిపోయింది.

Representative image
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూల్ డ్రింక్‌లో గడ్డిమందు కలిపి ఇచ్చి భర్తను చంపింది భార్య. భవాని కుంట తండాలో ఈనెల 8వ తేదీన దాటుడు పండుగ వేళ భర్త బాలాజీ (40) హత్యకు స్కెచ్ వేసింది భార్య కాంతి.
గడ్డి మందు కలిపిన థమ్సప్‌ను బాలాజీకి ఇచ్చింది. దాన్ని బాలాజీ లిక్కర్‌లో కలుపుకుని తాగాడు. కొద్దిసేపటి తర్వాత గొంతులో మంట రావడంతో అరుపులు పెట్టాడు. భర్త చనిపోతాడని భావించి కాంతి తన బావ ఇంటికి వెళ్లిపోయింది. స్థానికులు బాలాజీని గమనించి ఆసుపత్రికి తరలించారు.
Also Read: రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొంది: వైఎస్ జగన్
ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న బాలాజీ మృతి చెందాడు. మృతుడి తండ్రి హరిచంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వర్ధన్నపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త హత్యకు స్కెచ్ వేసిన కాంతి, ఆమె బావ దశరులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న కాంతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.