Ration Card: రేషన్ కార్డులు కావాలా? మీసేవలో ఇలా అప్లై చేసుకోండి.. వెళ్లేటప్పుడు ఈ ప్రూఫ్స్‌ తీసుకెళ్లండి..

రేషన్ కార్డు అప్లై కోసం సర్కారు ఫీజును రూ.50 నిర్ణయించింది.

Ration Card: రేషన్ కార్డులు కావాలా? మీసేవలో ఇలా అప్లై చేసుకోండి.. వెళ్లేటప్పుడు ఈ ప్రూఫ్స్‌ తీసుకెళ్లండి..

New Ration Cards

Updated On : February 12, 2025 / 8:27 AM IST

రేషన్‌ కార్డులను దరఖాస్తులు చేసుకోవాలని భావిస్తున్నారా? గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇటీవల దరఖాస్తుల స్వీకరణపై పలు రకరకాల ప్రకటనలు రావడంతో ప్రజలు కాస్త కంగారుపడ్డారు.

మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటన రావడంతో ప్రజలు భారీగా అక్కడకు చేరుకుని క్యూలు కట్టారు. చివరకు టెక్నికల్‌ ఇష్యూస్‌ వచ్చాయంటూ దాన్ని ఆపేశారు. వార్డు సభల్లోనే తీసుకుంటామని సీఆర్డీఓ ఫణీంద్రరెడ్డి ఓ ప్రకటన చేశారు.

మళ్లీ ఇప్పుడు టెక్నికల్ ఇష్యూస్ పరిష్కరించామని చెబుతున్నారు. ఇప్పుడు మీసేవలో కొత్త రేషన్‌ కార్డుల కోసం అప్లై చేసుకోవచ్చని ఆయన అన్నారు. కొత్త పేర్ల నమోదుతో పాటు తప్పుల సవరణలు, కొత్త కార్డుల కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.

Also Read: బంగారం కొంటున్నారా? రేట్లు ఎలాగున్నాయో తెలుసా?

కొత్త కార్డులకు అప్లై చేసేవారు తమ ఫ్యామిలీ మెంబర్స్‌ అందరికీ ఆధార్ కార్డులతో పాటు ఇంటి కరెంట్ బిల్లును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఇంతకుముందే రేషన్ కార్డు ఉండి ఫ్యామిలీలోని వారి పేర్లను అందులో జత పరచాలనుకుంటే వారి ఆధార్ కార్డులు ఇవ్వాలి. ఇప్పటికే ప్రజాపాలన లేదా ప్రజావాణిలో అప్లై చేసుకున్నవారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

రేషన్ కార్డు అప్లై కోసం సర్కారు ఫీజును రూ.50 నిర్ణయించింది. ఎవరైనా అంతకంటే ఎక్కువగా తీసుకుంటే ఫిర్యాదు చేయాలని చెప్పింది. ఇప్పుడు కొత్త కార్డులతోపాటు పాత కార్డుల్లో మార్పులకు కూడా దరఖాస్తులు తీసుకుంటుండడంతో చాలా మంది అప్లై చేసుకునే అవకాశం ఉంది.