Husband Killed Wife : పెళ్లైన నాలుగు నెలలకే భార్యను చంపి.. పారిపోతుండగా రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

దీప అనే యువతితో అరుణ్ కు ఈ ఏడాది మే5న వివాహం అయింది. అయితే పెళ్లైన కొన్ని రోజులకే అరుణ్ భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు.

Husband Killed Wife : పెళ్లైన నాలుగు నెలలకే భార్యను చంపి.. పారిపోతుండగా రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

husband killed wife

Updated On : September 2, 2023 / 1:06 AM IST

Husband Killed Wife In Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. అనుమానంతో పెళ్లైన నాలుగు నెలలకే భార్యను భర్త హత్య చేశాడు. భార్యను చంపిన అనంతరం పరారయ్యేందుకు యత్నించిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడకు చెందిన మోహితె జైవంత్, పద్మ దంపతుల కుమారుడు అరుణ్ మేస్త్రీ పని చేస్తున్నాడు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన దీప అనే యువతితో అరుణ్ కు ఈ ఏడాది మే5న వివాహం అయింది. అయితే పెళ్లైన కొన్ని రోజులకే అరుణ్ భార్యను అనుమానించడం మొదలు పెట్టాడు. ఇదే విషయంలో తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. ఈ క్రమంలో నాగులపంచమికి పుట్టింటికి వెళ్లిన దీపను ఆమె తల్లిదండ్రులు ఆగస్టు29న అల్లుడు అరుణ్ తో మెట్టినింటికి పంపారు.

Man Eat Wife Brain : మెక్సికోలో దారుణం.. భార్యను హత్య చేసి ఆమె మెదడును తిన్న భర్త

గురువారం రాత్రి దీపతో అరుణ్ గొడవ పడ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున దీపను మంచానికి కట్టేసి గొంతు నులిమి చంపాడు. అనంతరం అరుణ్ తన బైక్ పై పారిపోయాడు. దీప విగతజీవిగా కనిపించడంతో ఆమె అత్తామామలు షాక్ అయ్యారు. అరుణ్ కు ఫోన్ చేయగా దీపను తానే చంపినట్లు తెలిపాడు. ఈ క్రమంలో మమతా జిన్నింగ్ సమీపంలో అరుణ్ బైక్ లారీని వేగంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు దీప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త, అత్తామామలే తమ కూతురి ప్రాణాలను బలి తీసుకున్నారని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.