Huzurabad : నామినేషన్ల పర్వం షురూ
రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నికకు తోలి ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం మొదలవుతోంది.

Huzurabad
Huzurabad : రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నికకు తోలి ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం మొదలవుతోంది. 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ఉపఎన్నికకు హుజూరాబాద్ ఆర్డీవో రవీందర్‌రెడ్డిని రిటర్నింగ్ అధికారిగా నియమించారు. అభ్యర్థులు హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. కరోనా కారణంగా నామినేషన్ సమయంలో నిబంధనలు పాటించాలని ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పింది.
Read More : Huzurabad By Election : కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో ? బై పోల్‌ను లైట్‌గా తీసుకుందా ?
నామినేషన్ సమయంలో ఎలాంటి ఊరేగింపులు, మీటింగ్‌లకు అనుమతి లేదని పేర్కొన్నారు. నామినేషన్లు వేసేవారు మూడు వాహనాల్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయాలనికి వందమీటర్ల దూరం వరకుమాత్రమే వెళ్లడానికి అనుమతి ఉంటుందని చెప్పారు. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థితోపాటు ఇద్దరికి మాత్రమే లోపలకు ప్రవేశం ఉంటుందని తెలిపారు. ప్రతిఒక్కరూ విధిగా మాస్క్ ధరించడంతోపాటు, భౌతికదూరం పాటించాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచే అభ్యర్థుల ఖర్చులను లెక్కిస్తామని సీఈవో వివరించారు. కాగా గతంలో అభ్యర్థితోపాటు ఐదుగురిని లోనికి అనుమతిచేవారు.
Read More : Huzurabad : బీజేపీ నేతల్లో గెలుపు ధీమా..కారణం ఏంటీ ?